పరమార్ధం:- మన్నెం సత్యనారాయణ మూర్తి -మచిలీపట్నం -7981935848
సాహితికెరటాలు 
============
జీవిత పరమార్ధం 
తెలుసు కోవడమే

పరమాత్మ లో భాగమని
 తెలుసుకోవడమే

విపరీతఅర్ధలనుండి
రక్షింబడడమే

నానార్ధలకు లోనుకాకుండడమే

అపార్ధలకు దూరం కావడమే
 "అర్ధ" వ్యామోహంలో పడకపోవడమే

సరైన అర్ధం కనుక్కో వడమే
లక్ష్యం చేరుకోవడమే

పరమార్ధం తెలుసుకునే
అవకాశం మనిషికున్న వరం
తెలుసుకోలేని జీవితలెన్నో

తెలుసుకుందాంపరమార్ధం
జంతునాం నరజన్మ దుర్లభం
జయహో నరుడా
పరమాత్మ స్వరూపా..

కామెంట్‌లు