నా పంచపదుల సంఖ్య---1707-1708.1707.గొర్రెల మధ్యలో తిరిగే,ప్రాణం తీసే తోడేళ్లు వాళ్ళు!గొర్రెలేకమైతే కాళ్ళ,కింద పడి చస్తాయి తోడేళ్లు!నయవంచకులు తేనె ,పూసినకత్తులు మాయలోళ్ళు!దొరికి తీరతారు సీసీ ,కెమెరాలు ప్రజల కళ్ళు!ప్రజల ఐకమత్యమే, తీవ్రవాదం పై ఉక్కు పాదము,పివిఎల్!1708.తెల్లవారినే తరిమింది,ప్రజల సంఘటితశక్తి!తీవ్రవాదులు ఏ పాటి ,మరి చెల్లదు వారి కుయుక్తి!ఏనాటికైనా తప్పదు ,వారి నుండి మనకి విముక్తి!ఉగ్రవాద నిర్మూలన,ప్రజలకు అమిత ఆసక్తి!ప్రజలొక ప్రభంజనం ,తథ్యం ఉగ్రవాదం నేలమట్టం,పివిఎల్!_________
ప్రజల కళ్ళే! తుపాకీ గుళ్ళు!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి