"టీ" నీకు లేదు పో"టీ", రాదు సరిసాటి:- - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట -: 9490904976
 పల్లెల్లో టీ కొట్టు..
పట్టణాల్లో టీ ట్రీ, టీ హబ్, టీ టైం పలురకాల పేర్లు..
ఏదైనా మనం కొనేది, వారిచ్చేది టీ..
ప్రముఖమైనవి అస్సాం టీ, ఇరానీ టీ..
తెల్లవారితే త్రాగేది టీ, 
తలనొప్పిని తరిమికొట్టేది టీ..
తలపనిచేయనపుడు తీసుకొనేది టీ..
తన బంధువులు ఇంటికి వస్తే ఇచ్చేది టీ..
తోటి స్నేహితులు తారసపడినపుడు
మనం వారికి ఇప్పించేది టీ..
పార్టీగా పదుగురికీ ఇప్పించేది సమోసాతో, టీ..
బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ 
ఒకటేంటీ ఎన్నెన్నో వెరైటీలు..
తక్కువ ఖర్చుతో పార్టీగా ఇచ్చేది
"తేనీటి విందు". అది అందరికీ పసందు.
పేదాపెద్దలు తేడాలేక త్రాగేది గరంగరం టీ..
పెందలకడ పాచినోరుతో త్రాగేది బెడ్ టీ..
పనిపాటల్లో త్రాగేది టీ..
చదివేటప్పుడు విద్యార్థులు నిద్రను ఆపుకునేందుకు తీసుకునేది టీ.
పాఠశాలల్లో ఆడించేది పి.ఈ.టీ.
సహాయం చేయడం ఛారిటీ..
ఏదైనా అడగాలంటే ఏంటీ..
ఉద్యోగాలకు,చదువుల సీట్లకు పోటీ..
అధికారులు జరిపేది భేటీ..
మంచివైతే క్వాలిటీ...
పరిమాణం అంటే క్వాంటిటీ.
అత్తనైన, పిన్నినైనా ఒకే పిలుపు ఆంటీ..
అలనాటి/నేటి మేటి బ్యూటీ..
స్పష్టంగా తెలుసుకోవాలంటే క్లారిటీ..
బ్యాంకు వాళ్ళకు కావాలి ష్యూరిటీ..
దొంగలు చేస్తారు లూటీ..
పిల్లలకి ఇష్టం ఫ్రూటీ.. 
చల్లని ప్రదేశం ఊటీ..
టీ, టీ అనే మాట లేకుంటే లేదేంటి..

కామెంట్‌లు