సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు==============నీ ..బాధ్యత బాధ్యత బాధ్యతగొప్ప అర్థం ముడి కలిగినది బాధ్యతచితికి బతికినా బతికి చితికినప్రతి బ్రతుకు ఇల పైకి ..ఏదో ఓ బాధ్యతతో వచ్చినదే ..!!ఊపిరి ఉన్న క్షణం వరకుఊరేగక తప్పదు పుడమిని ప్రతి ప్రాణంప్రాణం ప్రాణం పోయే క్షణం వరకుతనకు కలిగిన బాధ్యతను తీర్చుకోక తప్పదుఎప్పటికైనా చివరికి క్షణం కడవరకు ..!!చీకటి వెలుగులది ఈ లోకానికిఅలుపెరుగని బాధ్యత ..భవ బంధాల అల్ప జీవుల బాధ్యత బంధంమరణం కలిగిన చితిమంటలచిరునామతో ముగిస్తుంది ..ప్రాణం ఎంచుకొని వచ్చిన బాధ్యత ..!!మనిషిని వీడింది నీడనుకుంటే పొరపాటుతలరాతన రాసిన బాధ్యతనేలరాలే క్షణం వరకు ..ప్రాణాన్ని వెంటాడుతూ వచ్చే మరణపు వడిలోబంధువై ముగిసిపోతుంది బాధ్యత ..!!అవుననుకున్నా కాదనుకున్నలేదనుకున్న ఉందనుకున్నాతప్పనుకున్న ఒప్పుకున్నాతరిమేసిన చేరదీసిన తప్పక తప్పనిదితలవంచి ప్రతి జీవి స్వీకరించాల్సినదే బాధ్యతబాధ్యత ముగిసినదా ..?బ్రతుకు ముగిసిన కథ అయిపోవాల్సిందేప్రతి జీవి ఇలపై ..!!
చావు బ్రతుకుల రహస్యం .:-చుంచు సంతోష్ కుమార్- మర్రిముచ్చాల-మొబైల్ : 9849572432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి