నాన్న:-కాకర్ల రమణయ్య : కాకర్ల-గుడిపాటిపల్లి- : 9989134834
సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
 ==============
కోమటి అంగట్లో తాయిలాలు అందనంత ఎత్తులో ఉన్నపుడు
పావలా  బిళ్ళ అయి కనిపిస్తాడు నాన్న..!

బడికి బయలు దేరి నప్పుడు
చెక్కలో దూరిన రాతిపలకై పలక రిస్తాడు..!

తెల్లని టావు కాగితాలలో 
నడి  కుట్టయి  నడుస్తాడు..!

తరగతి పుస్తకాల కొరకై  తాను అక్షరాలై , పేరాలై , పాఠాలు అవుతాడు..!

దుస్తుల దుస్థితికి అధిక శ్రమై అలసిపోతాడు..!

 తరగతి ,తరగతి కదిలే కొద్దీ 
వడలిన శరీరాన్ని తివాచీలా పరచి..నిద్ర కళ్లతో కాపలా కాస్తాడు..!

ఎదుగుదల ఒక్కో అడుగు నాన్న గుండెల్లో  వ్యయ ప్రయాసల గుదిబండై పడుతుంది..!

లోన అగ్ని పర్వతాలు
 బ్రద్దలవుతున్నా నిండు
గోదారిలా గల గలా పారుతాడు ..!

చిరాకులు,పరాకులు విసిగిస్తున్నా..,
చిరునవ్వుల గులాబీ పువ్వు అవుతాడు..!

నాన్న అంటే నడిచే చైతన్యం,
అంతర్వాహిని లాంటి ప్రేమ తత్వం..!

అందుకే 
నాన్నకు పాదాభివందనమే,ఈ చిన్ని జీవిత  పరమార్ధం..!


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సూపర్ మెసేజ్ మామ
కంచర్ల జయ కుమార్ చెప్పారు…
చాలా చక్కగా వ్రాశారు. మధ్య తరగతి నాన్న తాలూకు గత స్మృతుల జ్ఞాపకాల హారం