అంటే రావి చెట్టు అని అర్థం. దీన్ని మన భారతీయ సాంప్రదాయంలో అతి పవిత్రంగా భావిస్తారు. ఇది ఎక్కువ కాలం జీవించే వృక్షాలు. ఇవి చెట్లు ఎక్కడైనా మొలుస్తాయి. రాళ్ల సందులలో, కోట గోడ సందులలో, ఎక్కువగా మొలుస్తాయి.
"మా మే రాజు"అను మర్రి, మేడి, రావి జువ్వి ఈ వృక్షాలు భూమిపై మలవక రాళ్ల సందులలోనే ఎక్కువగా మొలుస్తాయి. భారతీయ జాతుల్లో కొందరు మరణించిన వారి యొక్క దాహార్తిని తీర్చేందుకు ఈ వృక్షం మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని నమ్ముతారు. ఇందు పంచాంగం ప్రకారం కొన్ని ముఖ్య అతిధులలో ఈ చెట్టు వేర్లలో నీళ్లు పోస్తారు. అలాగే ఈ వృక్షం ఎన్నో భూత ప్రేత పిశాచాలకు ఆవాసమని భావించే వారు ఉన్నారు. బహుశా అందుకేనేమో మన పెద్దవారు రావి చెట్టు కింద ఉన్నప్పుడు ఆవులించకూడదని అంటారు. అలాగే ఈ చెట్టు నీడన అబద్ధాలు కూడా చెప్పరాదని, మోసం చేయటం పనికిరాదని అంటారు. ఈ చెట్టు నాటితే వంశ పరంపర అభివృద్ధి జరుగుతుందని, దీన్ని పడగొట్టడం మహా పాపమని ప్రతీతి. థాయిలాండ్‌లో దీన్ని"ఫో"అని అంటారు. గొంతు రాపిడికి కండరాల నొప్పికి వాపులకు ఈ చెట్టు యొక్క బెరడును మందుగా ఉపయోగిస్తారు.
మహా బోధి వృక్షం. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి