పెరల్ బక్ పూర్తి పేరు పెరల్ సెడెస్ట్రికిర్ బక్. ఆమె సుప్రసిద్ధ రచయిత్రి. అమెరికన్ రచయిత అయిన పెరల్ బక్ కు నవలా సాహిత్యంలో ఓ విశిష్ట స్థానముంది.
పెరల్ ఎస్. బక్ తల్లిదండ్రులు చైనాలో మతప్రచారకులు. వీరు సెలవుల్లో స్వదేశానికి వచ్చినప్పుడు అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలోని హిల్స్ బరోలో పెరల్ బక్ 1892 జూన్ 26వ తేదీన జన్మించారు. ఆమె బాల్యమంతా చైనాలో గడిచింది. మొదట్లో ఆమె ఇంగ్లీషు కన్నాచైనీస్ భాషనే నేర్చుకుంది
ఆమె రాసిన వాటిలో మొట్టమొదటిది 1920 లో అచ్చయింది.
1931 లో ఆమె రాసిన గుడ్ ఎర్త్ అచ్చయినప్పుడు అమెరికన్ సాహిత్యంలో సుప్రసిద్ధ రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఆమె రచనలనన్నిటిలో చైనా జీవితం అందులోనూ గ్రామీణ జీవితం ఎక్కువగా ప్రతిబింబించేది.
పెరల్ బక్ భర్త జాన్ లాసింగ్ చైనాలో ఓ ఆర్థిక నిపుణుడు. బక్ దంపతులకు ఇద్దరు పిల్లలు.
అయితే అనుకోని కారణాలతో 1934లో తన భర్తకు విడాకులిచ్చి తన రచన గుడ్ ఎర్త్ ను ముద్రించిన జాన్ డే ప్రచురణ సంస్థ యజమాని రిచర్డ్ జె. వాల్ష్ ను పెళ్ళి చేసుకుంది.
1938 లో సాహిత్య విభాగంలో నోబుల్ బహుమతి పొందిన పెరల్ బక్ తన ఎనబై ఒక్కటో ఏట ఊపిరితిత్తుల కాన్సర్ వ్యాదితో 1973 వ సంవత్సరంలో మార్చి 6 న మరణించారు.
భారత జాతిపిత మహాత్మా గాంధీ 1948 జనవరి 30వ తేదీన గాడ్సే జరిపిన కాల్పులకు మరణించినప్పుడు పెరల్ బక్ రాసిన మాటలు చూడండి...
“మా గ్రామంలో మామూలు లాగానే సూర్యోదయమైంది. దూరంగా ఉన్న పాఠశాలలకు పోవలసిన పిల్లలను పొద్దున్నే నిద్ర లేపవలసి వచ్చింది. ఆకాశం బూడిద రంగుతో ఉంది. మంచు దట్టంగా ఉంది.
ఇంతలో హఠాత్తుగా మా ఇంటి పెద్ద వచ్చి ఇప్పుడే రేడియో అతి విషాద వార్తను ప్రసారం చేసింది. విన్నావా... గాంధీ మరణించినట్టు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వారికి ఈ వార్త ఎలా ఉంటుందో ఊహించలేరు. తన జీవితాన్నంతటిని ప్రజాసేవకు వినియోగించిన శాంతి దూత గాంధీజీ హత్య చేయబడ్డారు.
ఓ పది సంవత్సరాల కుర్రవాడు ఏడుస్తూ తుపాకులను ఎవరూ కనిపెట్టకుండా ఉన్నట్టయితే ఎంత బాగుండేది అన్నాడు.
మా కుటుంబంలో ఎవరూ గాంధీజీని చూడలేదు. మేము ఇండియా వెళ్ళినప్పుడు ఆయన జైలులో ఉన్నారు. ఆయన మా అందరికీ ఓ యోగి. తాను నమ్మిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోగల మహాత్ముడు.
గాంధీజీ మరణించిన రోజు విచారంతోనే మామూలు దైనందిన కార్యాలు చేసుకుపోయాం.
గాంధీజీ పలుకుబడి అమెరికాలో ఇంత గొప్పగా ఉండడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
ఓ గంట క్రితం రోడ్డున పోతూ ఉంటే ఓ రైతు లోకంలో అందరూ గాంధీజీ చాలా మంచి వాడని అంటారు. మరి ఎందుకని హత్య చేయబడ్డాడు అని అడిగాడు. అప్పుడు నేను తల ఊపాను.
జీసస్ క్రైస్ట్ ని ఎందుకు చంపించి ఉంటారో అలాటి కారణమే కావొచ్చు అన్నాడు నిట్టూరుస్తూ అతను.
ఆ రైతు చెప్పినది నిజమే. క్రీస్తును శిలువ చేసిన సంఘటనకూ గాంధీజీ కాల్చబడిన సంఘటనకూ ఎంతైనా పోలిక ఉంది. మా ఒక్క కుటుంబమే కాకుండా ఈ అమెరికా దేశంలోని ప్రతి కుటుంబమే కాదూ లోకమూ గాంధీజీ కోసం విచారపడుతోంది”

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి