గాలితో అభ్యంగన స్నానం చేసినట్లు
మేఘాల పొదల్లా కురులు కైలాస ద్వారం తోరణాలై వేలాడుతున్నాయి.
పూల తోట తనువు సువాసన ధనుషై పరిమళిస్తుంది.
మత్తెక్కిన మనసు స్వర్గపు పునాదుల్ని కదుపుతుంది.
అందమైన కుందనపు బొమ్మ ఆకాశంపై గీసినట్లు
చందమామ సముద్రం పై తెలియాడుతుంది.
గిరగిరా తిరుగుతున్న తలలా భూమి మీద అల ఒకటి
తీరం వైపు కదులుతున్నది.
జాబిల్లి నాభిలా బొడ్డు మల్లెలు పూస్తున్నాయి.
మల్లికలు కలువల్లా కదిలి ఒళ్లంతా చెమట బిందువులతో బంధిస్తున్నాయి.
జారిపడిన నడుము మధ్యలో ముత్యం ఒకటి
సముద్ర గర్భంలో సృష్టించబడింది.
లేత స్పర్శల్లో మగత చూపులు మైమరిచిపోయి నిద్రిస్తున్నాయి.
జగనాలు గగనంలో పుష్పక విమానాల్లా ఎగురుతున్నవి. మాంత్రిక దండాల్లా చేతి వేళ్ళు అల్లుకున్నవి.
బెదిరి నిద్రపోయిన మాటల్తో ఆధారాలు రెండు అదురుతున్నవి.
ఆకాశాన్ని ఆలింగనం చేసుకున్న శిశువును జోలపాటతో దరిత్రీ నిద్రపుచ్చింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి