మేం పాపులం...మేం పాములం...:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
మేం పాపులం...మేం పాములం...
మేం పాకిస్థాన్ టెర్రరిస్టులం...
చైనా చేతిలో మేం కీలుబొమ్మలం...

మేం అమాయకపు 
జింకల రక్తం త్రాగే రాక్షసులం... 
మేం రాబందులకు వారసులం.. 

మేం పాకిస్థాన్ ప్రేరిత 
కరుడు గట్టిన ఉగ్రవాదులం...
జీహాద్ పేర జీవహింస చేసే 
ఉన్మాదులం మతోన్మాదులం...

భార్యలముందే భర్తల ప్రాణాల్నిహరించి 
భార్యల నుదుట "సిందూరం" చెరిపేసి 
మురిసే మూర్కులం ముష్కర మూకలం...

మాతో "సమరానికి సై" అంటే అది 
నివురుగప్పిన నిప్పుతో చెలగాటమే...
అది అణుబాంబులతో ఆడుకోవడమే...
సింధూనదిలో పారేది నీరుకాదు రక్తమే...

మీ పర్యాటక ప్రదేశాలలో...
మీ పుణ్య క్షేత్రాల దారుల్లో...
దట్టమైన అడవుల్లో గుబురుగా ఉండే 
వృక్షాల వెనుక నక్కిన గుంటనక్కలం...

మేం శాంతి కపోతాల 
రెక్కలు విరిచే రాక్షసులం...
పాక్ ఆక్రమిత ఉగ్రవాద
శిబిరాల్లో దాక్కుని శిక్షణ పొంది
దారుణ మారణహోమాలకు దారులు 
వెతికే కుట్రలు పన్నే పిచ్చి కుక్కలం......

మే పాపులం...మేం పాములం...
మేం పాకిస్థాన్ టెర్రరిస్టులం...
చైనా చేతిలో మేం కీలుబొమ్మలం...



కామెంట్‌లు