అనుబంధం:- - యామిజాల జగదీశ్
 ఇక్కడి ఫోటో చూడటంతోనే అర్థం చేసుకోవచ్చు. ఒక ఆస్పత్రిలో బెడ్ మీద ఓ రోగి ఉన్నారని. అయితే తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఒక పావురం పడుకున్న రోగి మీద వాడటం. ఆ సంగతిని ఫోటో తీసిన నర్సు చెప్పింది....
"ఒక రోగి కొద్ది రోజుల క్రితం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే మూడు రోజులుగా ఆయనను చూడటానికి కుటుంబసభ్యులెవరూ రాలేదు. కానీ ఆ మూడు రోజులూ ఒక పావురం ఠంచన్ గా వచ్చి పడుకున్న ఆయన మీద వాలి చాలా సేపు ఉండి పోతుండేది. ఇంతకూ ఈ పావురానికీ వృద్ధి రోగికీ మధ్య ఉన్న బంధమేమిటో తెలుసుకోవాలనిపించింది. తీరా ఆ విషయాన్ని వృద్ధుడే చెప్పారు. ఆయన ఆసుపత్రి ఆవరణ బయట ఉన్న ఓ  బెంచీ మీద కూర్చునే వాడట. అలా కూర్చున్న సమయాలలో ఆయన  పావురానికి తప్పనిసరిగా రాగులు, సజ్జలు వంటి ధాన్యం గింజలు  ఆహారంగా చెల్లించేవారట....బహుశా ఆ అనుబంధమే ఆ పావురాన్నిలా ఆస్పత్రికేసి ఆకర్షించి రప్పించి ఉండొచ్చు అని ఆయన అభిప్రాయం. అది నిజమే కావచ్చు..."
ఆస్పత్రి నుంచి ఆ వృద్ధుడు డిశ్చార్జ్ అయ్యేంత వరకూ ఆ పావురం క్రమం తప్పక వచ్చేదని నర్సు చెప్పింది.
జంతువులు, పక్షులకే మనిషి కంటే ఎక్కువ మానవత్వం ఉందనడానికి ఇదొక నిదర్శనం అయి ఉండొచ్చేమో అని నర్సు మాట.

కామెంట్‌లు