సాహితీ కవి కళా పీఠం
=================
ధనమూలం ఇదం జగత్)
రూపాయి నితో ఉంటేనే ఆడంబరము'
రూపాయి నిర్దేశించును మనిషి గమనము '
రూపాయి నింపును నీలో ఆత్మస్తైర్యము
రూపాయితో కొనగలవు సమస్తము
రూపాయి పెంచును సమాజం లో నీ గౌరవము
రూపాయి నీ అంతస్తుకు కొలమానము
రూపాయి తో బలపడును నీ బంధము
రూపాయితో నే అవుతారు అందరు నీ చుట్టము
రూపాయితో పెరుగును ప్రపంచం లో నీ పరపతి
రూపాయే నిర్ధరించును సమాజం లో నీ స్థితి గతి
కానీ.........
(ధనం కన్న గుణం మిన్న)
మనిషి ఆలోచన రూపాయి చుట్టే నిరంతరము
బానిస అయ్యావో అది చేసుకొను నిన్ను వశము
రూపాయితో కోనగలవు భౌతిక వస్తువు
కానీ కొనగలిగిన వాని కి తక్కువ ఆయువు
రూపాయితో వచ్చేవి అస్థిరములు
కావు కావు ఎన్నటికీ శాస్వతములు
అత్యాశకు పోతే అన్ని అనర్ధములు
రూపాయి తీర్చాలి కేవలం నీ అవసరము
రూపాయి కోసం చెయ్యరాదు ఎలాంటి మోసము
చివరకు...రూపాయి నీదగ్గర ఉంటే నీవే ధనవంతుడు
పంచితే పేదలకు అవుతావు నీవే నీవే...భగవంతుడవు........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి