సుప్రభాత కవిత : - బృంద
కొత్త వెలుగుల 
పుత్తడి కాంతులు...
చరిత్ర పుటలలో 
సువర్ణ క్షణాలు 

మంచితనం చేతకానితనం 
కాదని 
ధర్మయుద్దం చేయక 
తప్పదని...

ఎదురెళ్లిన ధైర్యానికి 
ఎదురులేక పోవాలని 
కుదురు దొరకక కుతంత్రం
కృషించి పోవాలని..

దుర్గమమైన దారులన్ని 
సుగమమై  పోవాలని 
అడుగు వేసిన సైన్యానికి 
అండగా ఉండమని...

అమ్మలగన్నయమ్మకు 
అనేక మొక్కులిడుతూ 
ఆయుధాల

న్నిటిలో
ఆవహించి సహకరించమని....

అరుణోదయ కాంతులతో
ఆదరించ రమ్మని 
ఆదిత్యుని ఆహ్వానిస్తూ...
అనేకవందనాలతో

🌸🌸సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు