రాసులుగా పోసిన దుఃఖం ఒకవైపు
బావిగా మారిన దిగులు గుంత ఒకవైపు.
నీటి కోసం ఆశించలేదు మట్టి కోసం మనసు పడలేదు.
కాలం కనబడలేదు. కష్టం కనబడలేదు .
ఆఖరికి ఆశను అక్కడ పూడ్చి పెట్టాను.!!
ఊహ గృహాన్ని ఊహించాను. సొరంగాన్ని తవ్వాను.
తరతరాల చరిత్రలు తైల చిత్రాలు గుహల్లో బయటపడ్డవీ
ఊహకు ఊపిరాడటం లేదు
కళ్ళు కనిపించటం లేదు.
తెరలు తెరలుగా తెలివి గుహను తొలుస్తుంది.
అదంతా అంధకార అందవికార సొరంగం.
బయటపడ్డ భయం ఒకవైపు
సంతోష సొరంగం ఒకవైపు
రహస్య మార్గం కోసం సొరంగం తవ్వలేదు.
రహదారి కోసం సొరంగం తవ్వలేదు.
కాలం కనబడలేదు. కష్టం కనబడలేదు
ఆఖరికి ఊహను అక్కడ దాచి పెట్టాను.
అడవిని ప్రేమించాను. లోయను ముంచాను.
పర్వతం అడ్డొచ్చింది
అడ్డంగా ఆనకట్టను నిర్మించాను.
పర్వతాలను కలిపాను.
కన్నీరు ఒకవైపు పచ్చని పైరు ఒకవైపు.
కాలం కనబడలేదు .కష్టం కనబడలేదు.
ఆఖరికి ప్రేమకు ఆనకట్ట కట్టాను.!!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి