సాహితీ కవికళాపీఠంసాహితీ కెరటాలు================జాబిలి ఓ నా జాబిలిఏ కోటలో నిన్ను కొల్లగొట్టాను నమ్మలేనుగుండె లోతుల్లో నీవైపే ఈ దారి వెళుతుందినువ్వే వెలుగుని పంచే వెన్నెలై నిలుస్తున్నావే!ఆకాంక్షల తీరాలే తడిచే నా కలలేమౌనపు రాతల్లో విరహమే మాటలేకనుల సాక్షిగా ఎదురుచూపులేనీ కోసం వేచిచూస్తూ కాలమే నిలిచిపోయిందే!ఉసురే ఊసుగా నిన్ను పలికే వేదనగడియారమెరగని గమ్యం లేని ప్రయాణంనీ చూపే అమృతమై నిలిచిందేఈ శ్వాసల్లో నీవే పరవశమే!ఓ నా జాబిలి… ఈ ఘడియలోనైనాఓసారి రావే… నా హృదయం తడిసిపోతుందినువ్వే నా అందాల జాబిలిఈ జన్మంతా నీవే నాకు ప్రాణమవ్వవా…!
ఓ నా జాబిలి :- డా. మంజు ప్రీతం కుంటముక్కల-మదనపల్లి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి