మలినమెరుగని పువ్వులన్నీ
మనసుతీరగ నవ్వగా
మనసు నిండి మెత్తగా
మన పెదవి పైన విరియదా?
నీది...నాదను వాదనలేదు
ఏది తన సొంతమనుకోదు
ఎదురుచూడదు ఎవరికోసం
బదులు ఇమ్మని కోరుకోదు
పరిచయాలు వలదంటూ
పరిసరాలే ప్రపంచంలా
పరిమళాలు పంచుతూ
పరవశించు ప్రసూనము...
మౌనమెంత ఆనందమో
మనసుకెంత ఆహ్లాదమో
మనికికెంత విలువనో
మనిషికిది తెలియునా?
ఉదయరాగపు స్వరాలేవో
హృదయవీణను మీటగా
ఎదను పొంగిన ఉత్సాహం
జగతికి కాదా నవోదయం!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి