ఆశకు మితం లేదు. :- డా సి వసుంధర చెన్నై

  "ఏ దేశ చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం.
సమస్తం స్వార్థం, దాని పరమార్ధం ,పరిణామం యుద్ధం."
శ్రీ శ్రీ రాసిన దానికి మరో రెండు లైన్లు కలిపి రాసిన కవితను
చదివి నవ్వుకుంటూ 
పార్క్ వైపు నడక సాగించాడు జానకిరామయ్య. 
ఏవండీ నిన్న రాలేదు 
ఆరోగ్యం బాగాలేదా అంటూ జానకి రామయ్యను పలకరించుకున్నాడు
 బలరామయ్య.
**అంతే కదా అండి వయసు మల్లినతరువాత అదే ముఖ్య కారణం"అంటూ 
జానకి రామయ్య 
 కూర్చున్నాడు.
   "మీరు వస్తే గాని ప్రపంచ వార్తలుయుద్ద వార్తలు తెలియవు. మా ఇంట్లో టీవీ చెడిపోయింది ఎవరు చదవటం లేదని పేపర్ ఆపేశారు సెల్లులో ఎలా  వార్తలు పెట్టుకోవాలి నాకు తెలియదు. 
అందుకే మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను  ఆరు రోజుల నుంచి" అన్నాడు బలరామయ్య.
"అలాగా. ఏముంది తిన్న ఇంటి
వాసాలు లెక్కపెట్టి ఆశ బోతు మొహాలు 
అన్నం పెట్టిన ఇంటి పెద్దను బయటికి గెంటాలని చేసే ప్రయత్నం, వాడి దేవుడుసాగని స్తాడేమో గాని, మన మన దేవుడు వాడిని మట్టికరిపిస్తాడు" అన్నాడు జానకి రామయ్య చాలా ఆవేశంగా.
  "ఏమైంది సార్."ఆతృతగా ఆడిగాడు బల రామయ్య.
 భారతీయుల పాలి భగవానుడు మన ప్రధాని. ఆయన తీసుకున్న నిర్ణయాలు
  పాక్ను ను షాక్ కు గురిచేసాయి 
ఆపరేషన్ సింధూర్ 
 అదొక మెరుపుల ప్రవాహం
 ఉగ్రవాదుల స్టావరాలు నుగ్గు నుగ్గు
  మన ఆడపడుచుల
 నుదుటి సింధూరం
 మంటలు గా శత్రువు లను బూడిదచేసింది.
 జానకి రామయ్య మాటలకు అడ్డు వస్తూ ఇంతకీ మీ అబ్బాయి వెంటనే వెళ్ళిపోయాడు కదా అన్నాడు కొంచెం గబరా పడుతూ
"అవును 
వెళ్లి పోయాడు" అన్నాడు జానకి రామయ్య కళ్ళు మూసుకొని. 
 కంట్లో నుంచి రెండు చుక్కలు జారి కింద పడ్డాయి 
"ఏమైంది సార్ ఎందుకు....."
"అంటున్న బలరామయ్య తట్టు చూచి,
 మావాడు ఇ క్కడికి
సెలవు పెట్టి వచ్చాడు 
తీవ్ర మైన జ్వరంతో 
ఇంతలో యుద్ద ప్రకటనలో వాడు అలానే వెళ్ళిపోయాడు. 
  ఉద్యోగ ధర్మం. దేశ రక్షణ మా వాడికి 
హృదయం నిండా దేశభక్తి అందుకే వాడి ఆరోగ్యం ఈ పరిస్థితుల్లో క్షీణించినా
 ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని విజయ ఆనందం లో తృప్తిగా   అనారోగ్య బాధను భరిస్తున్నాడు. అదే నాబాధ."అన్న జానకి రామయ్య మాటలకు 
"మీరు అదృష్టవంతులు సార్.
 మీ కొడుకు ద్వారా 
మీ కుటుంబం అంతా భరతమాత రుణం తీర్చుకుంటున్నారు  అబ్బాయి మళ్ళీ క్షేమంగా విజయాలు సాధించి తిరిగి వస్తాడు బాధపడకండి"
అంటూ జానకి రామయ్య ఓదార్చ బలరామయ్య రెండు కాఫీలు తీసుకుని వచ్చాడు. ఆది తాగుతూ ఇద్దరు యుద్ధ విషయాన్ని మరింత చర్చించుకోవడంలో మునిగిపోయారు.
కామెంట్‌లు