సరిహద్దుల్లో...సమాధులు మీకు సిద్ధం..!: - కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
చర్చీ మసీదు
మందిరాలపై స్వేచ్ఛగా విహరించే
శాంతి గీతాలు ఆలపించే
శాంతి కపోతాల రెక్కలు విరిచి
ముక్కలు చేసి రక్తపు మడుగులో 
గిలగిలా కొట్టుకుంటూ ఉంటే...
కిలకిలా నవ్వే ఓ కిరాతకులారా..!

ఓ నయ వంచకులారా..!
ఓ నరరూప రాక్షసులారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా..!!

మిమ్మల్ని పెంచి పోషించే
విషసర్పాలు
విజయగర్వంతో విర్రవీగవచ్చు గానీ
ఇంతటి మానవ మృగాలను
కన్న తల్లీదండ్రుల కంట కారేది
కన్నీటి చుక్కలు కాదు రుధిరధారలే..!

ఓ రాక్షసులారా..!
ఓ రాబందులారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా..!!

ఆ అందాల కాశ్మీర్ లో
పచ్చటి పహల్గామ్ లో
మినీ స్విట్జర్లాండ్ బైసరిన్ లోయలో
విహరించే అమాయక పర్యాటక పక్షుల
శిరస్సులను ఛిద్రం చేయమని...
రక్తపు మడుగుల్లో ముంచమని...
ప్రాణాలను హరించమని...!

పచ్చని మైదానాన్ని
మరుభూమిగా మార్చమని...
మంచుకొండల్లో మంటలు రేపమని...
ఇంతటి నరమేధం సృష్టించమని...!

మిమ్మల్ని మతోన్మాదంతో రెచ్చగొట్టి...
జీహాద్ పేరుతో జీవహింస చేయమని...
ఏ రాక్షసుడు మీకు శిక్షణ నిచ్చేనురా..?
ఏ మతగ్రంధం దీనిని బోధిస్తుందురా..?

కసితో బుసలు కొట్టే
ఓ కాలసర్పాల్లారా..!
పచ్చని అడవుల్లో నక్కినక్కి తిరిగే
ఓ గుంట నక్కల్లారా..!
ప్రేమకు అర్థం తెలియని
ఓ పిచ్చి కుక్కల్లారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా..!!

దిక్కులు పిక్కటిల్లిన...
రక్తపుటేరులు పారిన..
ఆ పహల్గామ్ ఉగ్రదాడికి
విశ్వమంతా దిగ్భ్రాంతి చెందే...
భారతీయుల హృదయాలు
శోకసంద్రంలో మునిగిపోయే...

ఎలా భరించాలి ఈ గర్భశోకాన్ని...?
ఔరా! 26 మంది మీ తల్లుల తలలను
మతం పేరిట తమ భర్తల, 
తమ పిల్లల కళ్ల ముందరే
తెగనరికితే తట్టుకోగలదా మీ దేశమాత... 
అందుకే మిషన్ గన్నులతో విషం గ్రక్కే...

ఓ ఉగ్రవాదులారా..!
ఓ ఉన్మాదులారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా..!!

గన్నులు పేల్చేవారే
ఆ గన్నులకు బలౌతారని..!
నిన్ను వలె 
నీ పొరుగుదేశాన్ని ప్రేమించాలని...
మానవత్వమే మతమని...
దయగల హృదయాలే దైవమందిరాలని...

ఓ మూర్ఖులారా..!
ఓ ముస్కరులారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా...!!

శవపేటికలను కానుకలుగా పంపేవారు
వాటిని నవ్వుతూ స్వీకరించేవారు
అణు బాంబులతో బెదిరించేవారు
సింధూనదిలో పారేది నీరుకాదు రక్తమని
మత విద్వేషాలను...
రెచ్చగొట్టే మతోన్మాదులు... 
రేపు...ఆ శవ పేటికల్లో  నిద్రిస్తారని...

అహింసా భారత్ శాంతిని తప్ప 
యుద్ధం కోరుకోదని...
కానీ "సమరానికి సై" అంటే
సరిహద్దుల్లో మీకు సమాధులు సిద్దమని...

ఓ మానవ మృగాల్లారా..!
ఓ రక్తం త్రాగే రాక్షసుల్లారా..!
తెలుసుకోండిరా..!
సత్యం తెలుసుకోండిరా..!!



కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం