తప్పు లేరుగని సీతమ్మ:- ఎడ్ల లక్ష్మి
అయ్యయ్యో రామయ్యా 
సీతను అడవికి పంపావు 
ఒంటరిగా నీవున్నావు 
తల్లి తప్పులు చెప్పయ్యా

లంక నుండి తెచ్చావు 
వంకలు ఎన్నో పెట్టుతూ
నిప్పులాంటి సీతమ్మను
తప్పెందుకు పట్టావయ్యా

నిండు శూలాల తల్లిని 
ఎండలో ఎందుకు పంపావు 
దండికష్టాలు తెచ్చావు
తగదు తగదు రామయ్య 

లోకుల మాటలు విన్నావు 
లోక కళ్యాణం అన్నావు 
తప్పులేరుగని సీతమ్మను
తిప్పలపాలు చేశావయ్యా


కామెంట్‌లు