అమ్మ అంతరంగం:-Dr. C వసుంధర-చెన్నై
ఓ బాలా!నికు నేను పోసెను లాలా.
లాలపోసి నికు జొలపాడేను. గోల చెయ్యకు తండ్రి
జో జో.

నానమ్మకు పాపం
ఆకలేసేనయ్య
.తాతగారికి నేను మడి
బట్టలివ్వాలి.జో. జో.

మీ నాన్న వస్తాడు
అవురావురుమంటు 
అన్నము,ఆదరువులు
ఎట్లా చేసేది తండ్రి.
నిద్రపో నువ్వింక నవ్వింది చాలింక
మువ్వలు జల జల రాలినట్లున్నాది.జో. జో.

కొట్టంలో కట్టిన గోవు
మహాలచ్చిమి గోతెత్తి 
పిలిచెను అంబా అంటూ నన్ను .
దాని బిడ్డడు గడ్డి మేయలేడు గదరా!
అమ్మ చెంత చేరి
పాలు కుడువగా వలెరా.జో. జో.

నాపనులన్ని బిర బిరా
కావాలి.కాసేపు నువ్వు
కన్నుముయ్యర బాలా.
 గోపాల బాలా! మాఇంటి  భాగ్యమా మాకంటి వెలుగా  జో జో  ముకుందా గోల మాలరా చాలు.
                          
నాపనులన్ని చేసి. ఎత్తుకొందుర నిన్ను
కొత్త కొత్త లీలలు
సరికొత్త పనులు చేసి చూపర నేను మురిసిపోయేద తండ్రి.

కామెంట్‌లు