ఓ.. అమో!!:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.ఎం. ఏ (ఇంగ్లీష్ ); డి. ఎడ్.
అవ్వ!!

నీ చీరకొంగు నాకు తువ్వాల
నీ ఒడి నాకు ఊయల 
నీ నడుము నాకు కుర్సీపీట 
నీ మాట నాకు లాలిపాట

 అమ!! 

నీ సూపు చంద్రుని లెక్క 
నీ కుంకుం సూర్యుని లెక్క 
నీ సీర పచ్చటి పొలం లెక్క 
నీ సిగ కారుమబ్బు లెక్క

ఓ అమో!!

నీ కోపం తాటాకుఅగ్గి 
నీ పేమ సల్ల సుక్క
నీ సిరునవ్వు కాసుల పేరు
నీ కాలిగజ్జె నట్టింట జోరు

ఓ అమ్మ!!

నీ గుండెకు మెత్తబడెను రాతిబండ
నీ ధైర్నమే మాకు పేద్ద అండ
నీ సేతి వంట నాకు సెప్పలేనంత ఇట్టం
నీ తిట్లు నే ఓపలేనంత కట్టం.
________


కామెంట్‌లు