ఓ.......నా భారతదేశమా:- నామ వెంకటేశ్వర్లు, S Aజి. ప. ఉ. పాఠశాల, అయిటిపాముల,

  తల్లివి నువ్వే తండ్రివి నువ్వే స్నేహితుడివి గురువువి ఆత్మీయుడవు నువ్వే నిత్యం మాకు 
 నిన్ను రక్షిస్తూ..........మమ్ములను మేము రక్షించుకుంటూ....... మమ్ములను మేం పోషించుకుంటూ కాలం వెళ్ళ దీస్తున్నం.......
 ఇప్పుడు నిన్ను కబళించి  నిలువునా దోచుకోవడానికి ఎలుకలు పందికొక్కులు కొన్ని  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నయ్...                      "దేశామా "
 నిన్ను చీల్చి నిలువునా దోచుకొని నీకు కడుపు కోత పెట్టడానికి ఈ సవిత బిడ్డలు ఎదురుచూస్తున్నరు 
 వారి నుండి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావ్ తల్లీ.......     "దేశామా "
 నీ దగ్గర నివసించే నీ బిడ్డలకు 
 ఏది తినాలి ఏది తినవద్దు అని చెప్పి అనేక అనారోగ్యాలను పోగొట్టే అదురు చూపిన నీ బిడ్డలకు
 తిండి లేకుండా నిలువ నీడ లేకుండా చేస్తున్నరు తల్లీ....
 నీ బిడ్డలు పేదలు అమాయకులు     "దేశామా "
 మా హక్కులను హరిస్తున్నప్పుడు 
 మాకై మా వైపు నిలబడి 
 మా హక్కులను మాకు దక్కేటట్టు చేస్తున్న.... మమ్ము లను....... నిన్ను కాపాడుతున్న నీ బిడ్డలను సైతం చంపడానికి... లక్ష్యం చేసి చంపుటకు సిద్ధమైనరు....చంపుతున్నరు..వారి దేహాలను సైతం చిదిమి వేస్తున్నరు.. చివరకు కన్న తల్లిదండ్రులకు 
 అప్పగించటం లేదు.......వారిని, 
 ఇప్పుడు నిన్ను నీ బిడ్డలను భక్షించేవారే కానీ రక్షించేవారు ..... లేరు.......
  నిన్ను నిలువునాదోచి  నీ సవతి బిడ్డలకు పెట్టి...నిన్ను భిక్ష గత్తె ను చేయాలని చూస్తున్నరు నీ చోర బిడ్డలు     నీ బిడ్డల బ్రతుకు కై రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేస్తుంటే.. నిన్ను భక్షించబోతుంటే చోద్యం  చూస్తున్నరు....మీనమేషాలు లెక్కిస్తున్నరు మేమే అసలైన రక్షకులమని చెప్పుకునే నీ సవతి బిడ్డలు!  
 నిన్ను కాపాడే వాళ్లే లేరా...
 మానవ హక్కులను కాపాడే వాళ్లే లేరా....అయ్యో ప్రజాస్వామ్యమా.. అసలు నీవు ఉన్నట్టా ..... లేనట్టా ...
 నీ పేరు పదవుల వేట... ప్రజల సొమ్ము పంపకాలేనా....
"దేశామా "
   
కామెంట్‌లు