టిబెట్లో మంత్రాలను సంస్కృతంలో జపిస్తారు కానీ భోట్ భాషను అభిమానిస్తారు టిబెట్ భాష లో10వేల గ్రంథాలు సంస్కృతంలోంచి చేసిన అనువాదాలే అంటే ఆశ్చర్యమనిపిస్తుంది. టిబెట్ లో మంగోల్ భిక్షువులవల్ల రాహుల్జీ కి సోవియట్ రష్యాపై అభిమానం పెరిగింది.
టిబెట్లో స్త్రీల కి సర్వాధికారాలుండటంతో మొగుణ్ని మొత్తి మొగసాల కెక్కేరకాలను చూశాడాయన.ధనిక పురుషులని జనరల్ అనేవారు .జనరల్ షోగంగ్ భార్య , అతను ఇంకో ఆమెతో ఉంటున్నాడని తెల్సి వెంటనే ఇంటినుంచి బైటకి గెంటేసింది. ఆకలితో మాడకుండా తిండి ముష్టిలాగా పడేసేది. ఆభర్తకి డబ్బులవసరం ఐతే చిరిగిన దుస్తులతో వాకిట తారట్లాడేవాడు.ఓకవి ఆవిషయం పాటలుగా రాస్తే పిల్లలు పాడుకోటం ఇంకో చిత్రం! టిబెట్ లో8వశతాబ్దిలో నలందా ఆచార్యుడైన శాంతిరక్షితుడు కట్టించిన పురాతన మఠం సమ్ యే! ఇక్కడ పురాతన సంస్కృత గ్రంథాలు ఉండేవి.అవి సర్వనాశనం ఐనాయి.కారణం అగ్నిప్రమాదం!రాహుల్జీ18 కంచరగాడిదలపై పుస్తకాలు ఇతర వస్తువులతో 1930లో కాలిపాంగ్ చేరాడు.గాంధీజీని (రిన్ పో ఛే)సిద్ధపద్మసంభవుని అవతారంగా టిబెట్ భిక్షువులు భావించారు.లంకకు రాహుల్జీ ఓడలో గ్రంథాలు చేర్చారు.అక్కడ ఆయన్ని రామోదరస్వామి అని పిల్చేవారు.కానీ బౌద్ధ మత దీక్ష తీసుకున్న తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ గా మారాడు.ఆయన టిబెట్ని గూర్చిరాసిన వ్యాసాలు జనాలు ఆసక్తిగా చదివేవారు. లంక లో జనాలు దయ్యాలు లేవని వాదిస్తే కయ్యానికి కాలు దువ్వేవారు. భారత దేశంకి తిరిగివచ్చిన ఆయన కరాచీ కాంగ్రెస్ సభలో పాల్గొన్నాడు రాహుల్ జీ సింధు ప్రాంతంలో ఉప్పు కొండల్ని చూశారు.అదే సైంధవలవణం. సైంధవ అశ్వాలు ఉత్తమ జాతికి చెందినవి.ఆనాటి మొహంజోదారో శిథిలాలు చూసి కాశీ చేరారు.అక్కడ "బుద్ధచర్య,అభిధర్మకోశం" అచ్చువేయించారు. ప్రసిద్ధ సాహితీవేత్త అయోధ్యాసింహ్ ఉపాధ్యాయ ని కలిశారు.3వసారి లంకా విహారంలో చైనా పండితుడు ఒక ఆంగ్ల పత్రిక ఎడిటర్ వాంగ్ - మో- లమ్ దగ్గర చైనా అక్షరాలు నేర్చుకోవాలన్న రాహుల్జీ కోరిక నెరవేరలేదు.క్షయ రోగాన్ని భరించలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడువాంగ్!1932 లో కొలంబోలో ఓడెక్కి యూరప్ లో కాలుపెట్టిన ఆయన దాదాపు అన్ని దేశాలు చుట్టారు.పోలాండ్ లో రష్యన్ భాషనేర్చారు.భారత్ కి తిరిగి వచ్చాక మద్రాస్లో మ్యూజియం లో అమరావతి నాగార్జున కొండ కి చెందిన రాతి శిల్పాలు చూశారు.ఒక తెలుగు వృద్ధ బ్రాహ్మణ సంస్కృత పండితుని పరిచయం ఆయన కున్న నృత్య శాస్త్రంపై పట్టు రాహుల్జీని ఆకట్టుకున్నాయి.కానీ ఆయన పేరు తెలుపలేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి