అనాధ బాలకార్మికులం..!: మంజుల పత్తిపాటి (కవయిత్రి).ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్.యాదాద్రి భువనగిరి జిల్లా,: -9347042218.
అనాధ బాలకార్మికులం..!
కామాంధులు  తిని వదిలేసిన చిదిమేసిన 
ఎంగిలి విస్తరాకులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

బ్రతుకు కోసం మెతుకుకోసం పోరాటం చేస్తున్న
ఆరవ పంచభూతమైన
ఆకలికి వారసులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

రోజంతా మస్తు పని చేస్తాం...కడుపును పస్థులు  ఉంచుతాం...
వెట్టిచాకిరి చేస్తున్న భావిభారత పౌరులం మేము 
మేము అనాధ బాలకార్మికులం..!

సమాజంలో తన్నులు తిట్లు అవార్డులు పొందిన
ఉదయిస్తున్న సూర్యులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

ఇరానీ హోటల్ నుండి ఇటుకల బట్టిల వరకు 
అంతట కట్టు బానిసలమై జీవనోపాధి కోసం
బాల్యాన్ని బలిపశువులుగా చేస్తూ...
మోములో మోదమంటే ఎరగనోల్లం మేము
మేము అనాధ బాలకార్మికులం..!
మేము అనాధ బాలకార్మికులం..!
బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం!
బంగరు భవితకు బాటలు వేద్దాం!!
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (జూన్ 12)
సందర్బంగా..బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి మనం  అంతా 
కలిసి  పనిచేయాలని ముఖ్యంగా ప్రభుత్వాలు,
 సామాజిక సంస్థలు  కలిసి  పనిచేయాలని కోరుకుంటూ..
వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ...



కామెంట్‌లు