విమానమా: ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట -: 9490904976
✈️  
ఎగరాల్సింది పోయి
కూలిపోయి, పేలిపోయి
ముక్కలుగా రాలిపోయి
ప్రాణాల్ని ఎగరేసుకుపోయింది.
గాలిలో వెళ్ళాల్సింది..
అందరి గాలిని తీసేసింది.
మేఘాలలో వెళ్లాల్సింది
మేడలెక్కిసింది.
మేనులు, మానుల్ని..
మేలు చేసే మెడికొల్ని..
మాడ్చి మసిచేసేసింది..
విమానమా... 

"వి"ను..
"మా"విలువైన ప్రాణాలు తీసి కుటుంబాల్ని
"న"ట్టేట ముంచేయడం
"మా"నవా ..

విధి ఆడిన వింత నాటకమా..
నింద ఎవరిపై వేయాలి
నడిపేవాడిది తప్పో 
నడిపించేవాడిది తప్పో..
ఎవర్నీ నిందించాలి..


కామెంట్‌లు