సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు=================మదిలో దాగిన మౌన భావాలు,తెరలు తెరలుగా వెలువడే సాగే.నా ప్రేయసి తో గడిచిన క్షణాలు,చిన్ననాటి మా సరదా, సందళ్ళు,ఆడిన దాగుడుమూతల ఆటలు,అన్నీ గుర్తు కొస్తున్నాయి!!యౌవనంలో అడుగిడిన నీవు,అరవిచ్చిన మొగ్గలా,నిండు చందమామలా,తామర రేకుల్లాంటి కళ్ళతో,ముత్యాల వంటి పలువరుసతో,దొండపండు వంటి పెదవులతో,తిరుగాడుతుంటే మతి పోయేది.ప్రౌఢవై ఓణీ, పరికిణీ తో,లేడిలా పరుగిడుతూ, కనిపిస్తే,వంశం తప్పేది నా మనసు.పొడవాటి నీ వాలుజడ,నాగినిలా వీపుపై నాట్యం చేస్తుంటే,నీ కాలి మువ్వల సవ్వడి,నను మైమరపిస్తూ, ఊరిస్తే,ఎపుడెపుడు మన పెళ్ళగునో,అని ఎదురు చూస్తున్నా ఆత్రంగా.
మౌన భావాలు:- కోలా సత్యనారాయణ -విశాఖపట్నం - 9676623939
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి