"విప్లవ కెరటం: -కోలా సత్యనారాయణ విశాఖపట్నం : 9676623939
సాహితీ కవి కళా పీఠం
       సాహితీ కెరటాలు
=============='
మనిషి మనసు ఓ కష్టాల కడలి,
ఆ కడలిలో ఇంకిన ఎన్నెన్నో
వేదనలు, నిట్టూర్పులు,
పరాభవాలు, పరిహాసాలు.

ఎన్నాళ్ళు ఇలా సహించాలి?
విముక్తికి మార్గమే ఇక లేదా?
ప్రాణాలే పోయినా, మానాలే
మాసినా,
పరదేశికి ఎదురొడ్డి నిలబడాలి.
మన ముందుండి నడీపించేదెవరు?
అడుగో, మన నాయకుడు,
అడవి బిడ్డ అల్లూరి రామరాజు,
మనవైపే కదిలి వస్తున్నాడు,
మనకోసం చదువు నొదిలి,
విప్లవ కెరటమై వస్తున్నాడు.

కదలండి అందరూ చేయి కలిపి, 
తీయండి విల్లమ్ములు, ఈటెలు,
బరిశెలు, బాణాలు, సుత్తులు.
కదులుదాం సాహసంతో,
బిటీసోల్ల పొగరనిసి,
తరుముదాం మన గడ్డ నుండి,
బానిస సంకెళ్ళు వదిలించి,
విప్లవ కెరటాలులా, వీరమాత
నుదుట తిలకం దిద్దుదాం‌.


కామెంట్‌లు
Popular posts