చీకటి వెలుగుల జాబిల్లీ!!:- కోలా సత్యనారాయణ - విశాఖపట్నం - 9676623939

 సాహితీ కవి కళా పీఠం 
   సాహితీ కెరటాలు
==================
చందమామా! ఓ ముద్దుల మేనమామా! 
నిను చూపించే,బువ్వ తినిపించేది అమ్మ.
తెల్లని మేని ఛాయ, గుండ్రని ముఖంతో,
నిను చూసి దక్షుడే తన సుతలతో పెళ్ళి జరిపే.
రోహిణిపై వివక్ష తెచ్చె, కళావిహీనం శాపంగా.
శివుని ద్వారా పక్షం వృధ్ధి, పక్షం క్షీణం వరంగా పొంది,
ధీశాలివై నిలిచావు చరిత్రలో.
నీవు సరసుడవు, కొంటె కోణంగివి.
ఆడుకుంటావు ప్రేమికులతో సరదాగా.
ఓ క్షణం కురిపిస్తావు చల్లని వెన్నెల.
మరో క్షణం దాకుంటావు మబ్బుల్లో.
విరహాగ్నిని రగిలించి, నీవే చల్లారుస్తావు.
అందుకే, కష్టం సుఖం సమంగా తలచి,
కష్టాలొస్తేకుంగక, సుఖానికి పొంగక,
శుక్ల పక్షంలో దినదినం కళలు పెంచుతూ,
కృష్ణ పక్షంలో అనుదినం కృశిస్తూఉండే,
నిను ఆదర్శంగా తలచి ముందుకు సాగుతాం.
జీవితమే చందమామ అనుకుంటాం.

కామెంట్‌లు