చందమామ:- కొమురవెల్లి అంజయ్య-సిద్దిపేట-...9848005676
చందమామా చందమామా
మా కలలరేడు నీవమ్మా
విందులు చేయగ రావమ్మా
మా వెన్నెల వెలుగమ్మా

ఎండ మంటలు నీకమ్మా
వెన్నెల సొగసులు మాకమ్మా
పరావర్తనం నీ గుణమమ్మా
పున్నమి పొందు మాదమ్మా

కథల రారాజు జాబిల్లి
ఏడుపు మానగ మాతల్లి
మైమరిపించే కన్నతల్లి
నోట్లో బుక్క మాయమే చెల్లి

కాలు మోపాము నీ పైన
విర్రవీగాము ఎదలోన
జీవమున్నదా నీ పైన
కనుగొంటాము ఇకనైనా

నివాసముండగా నీ పైన
కలలుతీరేనా మావైనా
అందని సౌఖ్యాలిలలోనా
అక్కడేమైనా అందేనా
...................................... .................


కామెంట్‌లు