సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు======================"చందమామ రావే..జాబిల్లి రావేకొండెక్కి రావే.. గోగుపూలు తేవే "చిన్నప్పుడు అమ్మ పాడిన చందమామ !నాటి నుంచి నువ్వే మాకు మేనమామ !!నువ్వు మా చెంతకు రావాలని,నీ వెన్నెల హాయి దక్కించుకోవాలని,నీ తెల్లని అందాల రూపాన్ని తాకాలని,చిన్ననాటి నుండి ఎన్నో కోరికలు,ఆశలు !పెద్దయ్యాక తెలిసింది...అమ్మ పాటను ఎంత పాడినా నువ్వు రావని,మేమే నీ చెంతకు రావాలని,మొదలైంది...మా చందమామ అన్వేషణ !అప్పుడే అవగతమైంది ఓ జీవిత సత్యం...చీకటివెలుగులు,సుఖదుఖాలు,గెలుపోటములనడుమ ఊగిసలాడే మనిషి జీవితగమనమే...అమావాస్య నుంచి పున్నమి వరకుదినదినాభివృద్ధి చెందిన చందమామయని !ఒకరినొకరు అర్థం చేసుకున్న ఆలుమగల దాంపత్యమే..పున్నమి వెన్నెల చందమామయని !ఆశల పల్లకిలో పయనించే మనిషి మనసు...తారల మబ్బుల నడుమ దోబూచులాడే చందమామయని !మన కష్టాల్లో తోడునీడగా ఉన్న ఆప్తమిత్రుడు...కష్షాల చీకటి లో ఆశాజ్యోతైన చందమామయని !ఓ మనిషి...జీవితంలోని ఆటుపోట్లను స్పృశిస్తూ...చందమామలా తగ్గుతూ..ఎదుగుతూ..సాగించాలి నీ జీవిత ప్రయాణం !మానవ జీవితమే చందమామ అవునేమో !!**************
చందమామలా బతకాలి :- కోటమహంతి వెంకటరావు(కోవెరా).విశాఖపట్నం, 98491 91092
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి