విప్లవశంఖారావమే ఆయన కలానికి బలం.సాహితీవనంలో మణిపూసకుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అనిఛందోబద్ద కవిత్వం కాదుసామాజిక స్పృహ కలిగిన కవిత్వమే సమాజాభివృద్ధికి సోపానం అన్న సాహితీ మూర్తి,అక్షర శ్రామికడు శ్రీ శ్రీ అందుకోమా శతకోటి వందనములు......!!పూడిపెద్ది వారింట పుట్టిశ్రీరంగం వారి దత్తతతో శ్రీ శ్రీ గా మారిన శ్రీరంగం శ్రీనివాసరావు సాహిత్యపు దశా-దిశా మార్చిన సమాజకవి.అభ్యుదయరచయితల సంఘ అధ్యక్షునిగా, సినీగేయరచయితగా,విప్లవరచయితల సంఘ స్థాపకునిగా సాహిత్యానికే ప్రపంచాన గుర్తింపు తెచ్చిన మహాకవి శ్రీ శ్రీ అందుకోండిమా శతకోటి వందనములు........!!పతితులార,భ్రష్టులారాభాధాసర్పద్రష్టులారాదగాపడిన తమ్ములారఏడవకండేడవకండి అని నిర్భయంగా చాటినా,మరోప్రపంచం, మరోప్రపంచం, మరోప్రపంచం పిలిచిందిపదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అన్నా,ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అన్న విప్లవకవి శ్రీ శ్రీ అందుకో మా శతకోటి వందనములు......!!మనసున మనసై, బ్రతుకున బ్రతుకై అన్న,హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి అని వ్రాసినా,తెలుగువీర లేవరా దీక్షపూని సాగరా అని ఎన్నో ఎన్నెన్నో సినీగీతాల రారాజువై ప్రఖ్యాతినొందిఈ శతాబ్దపు మహకవిని నేనే అని సమాజానికి ధైర్యంగా చాటిన శ్రీ శ్రీ మీరు" నవయుగ వైతాళికులే"అందుకోండి మీ కివేమా శతకోటి ప్రణామాలు ........!!...............................
నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-:-9963265762
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి