పెద్దల అంగీకారమే అలంకారం:- విత్తనాల విజయకుమార్-హైదరాబాద్-9985117789
సాహితీ కవికళా పీఠం
 సాహితీ కెరటాలు 
=============
హృదయ స్పందనకు మూలం ఆకర్షణ,
రంగూ, రూపూ, మాటా, అల్లరి ఆకర్షణలే.
ఆకర్షణలకు కలిగేదే ఆనంద భావన,
ఆ భావాల్లో కనబడేదే అందాల హరివిల్లు.

తొలిప్రేమ మదిని తొలిచేసే తొలకరి జల్లు,
ఎదిగే వయసులో ఎదలో అంకురిల్లు.
చూపుల కోసం ఒకరికొకరు అటవటిల్లు,
వారి శత్రువులవుతారు అడ్డమొచ్చినోల్లు.

తొలిప్రేమలో ఉంటుంది మతిమరుపు,
విషయాలను పట్టించుకోని మైమరుపు.
పిలిచినా పట్టించుకోని తెరుపుమరుపు,
తల్లిదండ్రులు గుర్తించాలి పిల్లల ఏమరుపు.

పరిణతి లేని వయసులో ప్రేమ వికారం,
ఒక ఆరోగ్య చిహ్నమైన భౌతిక వికారం.
దానికి భవిష్యత్తవుతుంది అంధకారం,
అందుకే తల్లిదండ్రులు ఇవ్వరు అంగీకారం.

పిల్లలను తీర్చిదిద్దేది పెద్దల మమకారం,
ఓర్పుతో పిల్లలకు నేర్పాలి సంస్కారం.
దానికి కావాలి అందరి సహకారం,
పిల్లలకు అవుతుందది పెద్ద ఉపకారం.
పిల్లలు స్థిరపడటమే పెద్దలకు అలంకారం.

•••••••


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సూపర్
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది