ప్రజా పోరాటాలే హద్దు :- విత్తనాల విజయకుమార్-హైదరాబాద్ -9985117789
సాహితీకవికళా పీఠం
 సాహితీ కెరటాలు 
================
నింగీ, నేలా, గాలీ, నీరూ, నిప్పులకు,
పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ,
నీతీ, నిజాయితీ, నిలకడలకు నీళ్ళొదిలేస్తే,  
ముడిసరకుకి ధర పొందని కర్షకులతో,
ఉత్పత్తికి తగ్గ వేతనం లేని కార్మికులతో,
పోరాటపటిమలు బయట పడతాయి-

తిరగబడ్డ ప్రజా ఉద్యమాలకు,
పత్రికా రచయితల వ్యాసాలతో,
ప్రతిపక్ష నాయకుల పోరాటాలతో, 
సమాజ దోపిడీని బయట పెడితే, 
సర్కారు తెచ్చే సంబంధిత చట్టాలకు, 
ప్రజా పోరాటాలు ఆగిపోతాయి-

శ్రమించే కర్షక కార్మికులకు మన్ననొసగక,
నీచమైన పనులకు జాతిని వాడుతూ,
మనుషుల మనసులకు చేసిన గాయాలు 
మానక చెలరేగితే పుట్టేవే విప్లవాలు-

సామాజిక అసమానతలనూ,
బడుగుల బాధలనూ వెలుగులోకి తెచ్చే,
విప్లవ కవిత్వం ఉద్యమాలకు ఊపిరిచ్చి,
నక్సలైట్లుగా మారే వారి ఊపిరి తీసే,
విప్లవాలు వద్దు; పోరాటాలే మన హద్దు-

•••••••••••••••

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
విప్లవాన్ని సున్నితంగా తిరస్కరించడం , పోరాటానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలో చెప్పడం ....
చాలా బాగుంది .

చేసిన ప్రయత్నం ....నాలుగు వాక్యాల్లో స్పష్టత ఉంది.
సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కవిత బాగుంది. సంతోషం..
T Narayana Murthy చెప్పారు…
విప్లవాలు వద్దు అని చాలా చక్కగా చెప్పారు విజయ్ కుమార్ గారు.
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం