దేవ దేవా..:- కాకర్ల రమణయ్య-గుడిపాటిపల్లి- 9989134834
సాహిత్య కెరటాలు కవి కళా పీఠం 
సాహితీ కవితలు
================
ధర్మం నాలుగు పాదాల 
మీద నడిచిన సత్తెకాలంలో
పేదవాడు పేదవాడు 
గానే ఉన్నాడు.

అంతర్జాలాలు అభివృద్ధి
చెంది ఆకాశ యాణం చేసే 
ఈ రోజూ, పేదవాడు
పిడికెడు మెతుకుల కోసం
దేవులాడే  బికారే ..

బక్కచిక్కిన బ్రతుకులు
పొట్ట కూటి కోసం నాడు నేడు
బ్రతుకీడుస్తూనే ఉన్నాయి..

చిల్లర పైసలకు చేతులు చాచే
వీధి బాలల మనోగతంకు ,

చిరిగిన దుస్తుల దీనస్థితికి 
చిల్లులు పడిన హృదయానికి
ఆత్మ బంధువై..

ఆకలికేకల గరళాన్ని 
మ్రింగే దేవ దేవుడవై
దిగిరావా..నీల కంఠుడా..!


కామెంట్‌లు