సాహితీ కవికళా పీఠంసాహితీ కెరటాలు=============అమ్మ ఆలంబనఅపురూపమైన ముద్దు.!నాన్న గుండె చాటుగుంభన ప్రేమ..!కొత్త పుస్తకాల సమ్మోహనపరిమళం..!జామెంట్రీ బాక్స్ లో దాచిననిమ్మ బద్ధ పులుపు..!ఆటస్థలములో జారిపడ్డగతాలు..!నూనూగు మీసాల దొంగ చూపులు...!విరబూసిన నవ్వులను గంపకు ఎత్తుకున్న దినాలు..!ఈతలో అడుగుమట్టి తెచ్చిన క్షణాలు..!ముళ్ల కంప లో లేపినజుంటితేనెను చప్పరించినమధుర కాలాలు..!అలజడి రేపిన కలువ కన్నులసుందరి..!మాటల పూబంతులనురువ్విన మధుర క్షణము..!తొలి కవితను కలం సిరాలోఓలక బోసిన యవ్వనం..!తొలి కథను పత్రిక ప్రసవించిన ప్రౌఢత్వం..!భాగస్వామి హృదయం లోవేసిన తొలి అడుగు గుండెచప్పుడు..!తొలిచూలు చల్లని కబురు చెవులకు సోకినమలయమారుతం..!తొలిబిడ్డ నవ్వులుగుండెలలో గుడి కట్టిన నాదం..!తొలిజీతం నాన్న ఆశల దోసిలిలో పోసిన దరహాసం..!ఇవ్వడమే కానీ తీసుకోవడం ఎరుగని అమ్మకు చీర కానుక చిరు గర్వం ..!ఎన్నెన్ని మధుర స్మృతులుతవ్వితే ఊరు ఊట బావిలాగా..త్రాగితే తొలగు దుఃఖ మూలాలు..!
స్మృతుల పరిమళం:- కాకర్ల రమణయ్య-గుడిపాటిపల్లి-: 9989134834
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి