ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా విద్యార్థిని జన్మదిన వేడుకలు

 ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న కూస 
హార్నిక జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని అందంగా ముస్తాబై పాఠశాలకు వచ్చిన హార్నిక తోటి సహచరుల మధ్య జన్మదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంది. చిన్నారి హార్నిక  జన్మదిన వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యాబుద్ధులతో, ఆయురారోగ్యాలతో, చిరకాలం చిరంజీవిగా వర్ధిల్లాలని, ఆ భగవంతుడు ఆమెను చల్లగా చూడాలని ఈర్ల సమ్మయ్య ఆకాంక్షించారు. చిన్నారికి స్వీట్స్ తినిపించి, బహుగా దీవించి, ఆశీర్వదించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పిల్లలు హార్నికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లల ఆనందం కోసమే ఇలాంటి వినూత్న కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉందని, పిల్లలు ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ విద్య, విజ్ఞానం వికసిస్తుందని, అందుకే స్వేచ్ఛాపూరిత, ఆనందకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, బండారి స్రవంతి, పిల్లల తల్లిదండ్రులు  పిల్లలు పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు