ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, 185 సంవత్సరాలకు పైగా ఓ ఘంట ఆగకుండా మోగుతూనే ఉంది. కానీ ఎందుకలా నిరంతరాయంగా మోగుతోందో ఎవరికీ తెలియదు.
దానిని "ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్" అని అంటారు. ఈ వింత పరికరం ఏకైక బ్యాటరీతో నడుస్తోందని విశ్వవిద్యాలయం వారు చెబుతున్నారు, కానీ అన్నేళ్ళుగా ఎలా మోగుతోందనే విషయం నేటికీ ఒక రహస్యంగానే ఉంది. ఈ ఘంట 1840 నుండి నిరంతరం ఎలాంటి అంతరాయమూ లేకుండా మోగటం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శతాబ్దాల నాటి ఈ పరికరాన్ని ఎవరూ తెరచి చూడటానికి పూనుకోవడం లేదు అనేకంటే సాహసించడం లేదనేదే వాస్తవమని విశ్వవిద్యాలయం ప్రతినిధుల మాట. ఒకవేళ తెరిస్తే ఏమైనా ఆటంకం కలుగుతుందేమోనని ఆలోచిస్తున్నారట.
ఇది జింక్-సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీ యొక్క ప్రారంభ రూపం కావచ్చునని చాలామంది అభిప్రాయం. పని చేసినంత కాలమూ పని ఘంటానాదం వినిపించనిద్దాం అని విశ్వవిద్యాలయం వారంటున్నారు.
సాధారణ సాంకేతికత కూడా కొన్నిసార్లు తరతరాలుగా ఎలా ప్రభావం చూపుతుందో అనడానికి ఇదొక అద్భుత కదండీ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి