అయ్యో అయ్యో
ఓ దైవమా...
ఏమిటీ ఈ ఘోరం...
ఎందుకింతటి దారుణం...
ఏమైంది ఆ మూగజీవాలకు..?
ఎందుకు ఇంతగా
క్రూరంగా ప్రవర్తించాయి
ఆ వాహనదారులెవరూ
వాటిని కర్రలతో కొట్టినట్టుగాని...
వాటికి ఏదైనా కాసింత బాధనైనా
కలిగించినట్టుగాని లేదే...
మరెందుకు...? ఎందుకు..?
వీధిలో రెండు ఎద్దులు...
ఇద్దరు మనుష్యులను క్రింద పడేసి
ఒకదాని తర్వాత మరొకటి కసితీరా
వారు తప్పించుకునే
అవకాశమే లేకుండా మార్చి
మార్చి కోపంతో పొడిచి పొడిచి...
కొమ్ములతో ఎందుకు కుమ్మేశాయి..?
ఎందరడ్డొచ్చినా
అదరక బెదరక పాపం
హఠాత్తుగా ఎందుకు ఆ ఇద్దరు
వ్యక్తుల జీవితాలతో ఆడుకున్నాయి..?
పట్టపగలు
నడిబజారులో
అందరి కళ్ళముందే
కత్తులతో వీధి రౌడీల్లా...
పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి
విచ్చల విడిగా ఎందుకు
వీరంగం సృష్టించాయి...?
ఇద్దరిని కాళ్ళతో తొక్కితొక్కి
కొమ్ములతో కుళ్ళబొడిచి
దోపిడీ దొంగల్లా దర్జాగా
ఎందుకు పారిపోయాయి...?
ఎందుకంత వింతగా...
ఎందుకంత ఆవేశంగా...
ఎందుకంత క్రూరంగా...
ఎందుకంత ఘోరంగా...
ఎందుకంత దుర్మార్గంగా...
అతిదారుణంగా ప్రవర్తించాయి..?
బీభత్సాన్ని సృష్టించాయి..?
దారిన పోయే ఆ
అమాయకపు వ్యక్తులపై
ఎందుకు విరుచుకు పడ్డాయి..?
ఎందుకంత దారుణంగా
దాడిచేసి ప్రాణాలతో గిలగిలా
కొట్టుకొనేలా పొడిచేశాయి..?
ఇట్టి మూగజీవాల మీద మనమిక
కనికరం జాలి ఎందుకు చూపాలి...?
ఎందుకు తిండి పెట్టి పోషించాలి...?
ఓ జంతు ప్రేమికులారా...!
ఒక్కసారి ఆలోచించండి...!
అయ్యో ఓ దైవమా ఇది విధిలిఖితమా...
వారి గతజన్మ పాపఖర్మల ఫలితమా..?
ఆ మూగజీవుల వింత ప్రవర్తనకు
అసలు కారణమెంతకూ అర్దం కాకున్నదే...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి