ఎండాకాలం సెలవులు వచ్చాయి. పిల్లలు అమ్మమ్మ ఇంటికి చేరినారు. అమ్మమ్మ, తాతయ్యలు చాలా సంతోషించారు. వంటపని అయ్యాక అమ్మమ్మ పిల్లల దగ్గర చేరి, తాను చిన్నతనంలో ఆడిన ఆటలను పరిచయం చేసి, ఆ ఆటలను పిల్లల చేత ఆడిస్తుంది. మొబైల్ ఫోన్లకు, టీవీలకు బానిసలు అయితే భవిష్యత్ ఎలా అంధకారం అవుతుందో సవివరంగా చెప్పింది. మంచి మంచి కథలను చెప్పి, పిల్లలు కథలు అంటే ఇష్టపడేలా చేసింది. ఆ తర్వాత రకరకాల కథల పుస్తకాలను తెప్పించి పిల్లల చేత చదివింపజేసింది.
శ్రావణికి కథలు అంటే బాగా ఇష్టం ఏర్పడింది. సెలవుల తర్వాత ఇంటికి వెళ్ళాక శ్రావణి వాళ్ల అమ్మా నాన్నల చేత కథా మేగజైన్లను క్రమం తప్పకుండా తెప్పించి చదివేది. తన ఇంటికి తీరిక సమయాలలో వచ్చిన స్నేహితులకు, సెలవు రోజుల్లో ఇంటికి వచ్చిన బంధువుల పిల్లలకు కథల ఆవశ్యకత చెప్పి, కథలంటే ఆసక్తి కలిగించి కథల పుస్తకాలను చదివింపజేసేది.
శ్రావణి కథలు చదవడం వ్యసనంగా చేసుకుంది. ఫలితంగా శ్రావణికి అన్నీ మంచి లక్షణాలు అలవడ్డాయి. చదువులో క్రమశిక్షణలో అత్యుత్తమ విద్యార్థిని అయింది. తీరిక సమయాలలో నీతికథలు చదవడం అలవాటు చేసుకుంటే మనకు నైతిక విలువలు అలవడి భవిష్యత్ ఉజ్జ్వలంగా ఉంటుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి