కవి,రచయిత, ఉపాధ్యాయులు గా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందిన కస్తూరి ప్రభాకర్ రాసినకవితా సంకలనం "మట్టికాళ్ళ
------------- ముట్టడి" లోని మొదటి కవిత
------------ అతనొక 'సామాన్య' ఉపాధ్యాయుడు. అనే కవిత లో ఉపాధ్యాయుడంటే ఒకే మూస లో పయనించడం కాదు సమాజం పరిశీలిస్తూ..సమాజంలో ప్రతి ఒక్కరిని అన్ని కోణాలలో ఆలోచింపజేసేవాడని,సామాన్యంగా కనిపిస్తూ అసామాన్యమైన పనులు ఎన్నో చేస్తూ చేయించే వాడని అనేక ఉదాహరణలతో ఈ కవితలో ప్రతిబింబింప చేశారు.
కొన్ని విషయాలు మచ్చుకు నేను విషదపరుస్తున్నాను. ఎంతసేపు జీవితం అంటే భార్య పిల్లలు కుటుంబం, ఉద్యోగము, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు, టి ఏ డిఎ ల తన అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించ కుండా , పిల్లలను ఎలా ఉన్నత స్థానాలకు తీసుకురావాలని అనేక రకాలుగా ఆలోచించేవాడు ఉపాధ్యాయుడని, చదువులంటే విదేశాలలో డాలర్లు సంపాదించాలనే కలలు కనడం కాదని, చదవంటే పరీక్షలు సర్టిఫికెట్లకు ఉద్యోగానికి పరిమితం కాకుండా, చదివిన జ్ఞానాన్ని భావాన్ని సమాజానికి అందించాలని, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను తెలియపరచాలని అనుకోవడమే కాదు నేర్పేటోడే సామాన్య రూపంలో ఉన్న అసామాన్య ఉపాధ్యాయుడని, కడుపులో ఉన్న బాధను గుర్తించి చైతన్యంతో వాటికి పరిష్కారాలు వెతికి పెట్టేటోడు సామాన్య రూపంలో ఉన్న అసామాన్య ఉపాధ్యాయుడని పరోక్షంగా చెప్పారు.
ఈరోజుల్లో చాలా ఉపాధ్యాయ సంఘం నాయకులు సంఘం పేరు చెప్పుకొని ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కోసమే మేము పనిచేసేది అని చెబుతూ తమ సొంత కార్యకలాపాలు నెరవేర్చుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ..... సాగిలపడుతున్నారు కానీ అలా ఉండేటోడు కాదు, అధికారుల అక్రమాలని ఎండగడుతూ ధర్నా శిబిరాల్లో గర్జించే గొంతుకని, పాలకులు ప్రజల కు తలపెట్టే దుర్మార్గాలని, ప్రజలు చేపట్టే ఆందోళన లోకి ప్రవేశించి నిలదీసినోడని, స్వార్థపూరితంగా తన కడుపు నిండితే చాలు అనుకునేటటువంటి ఉద్యోగస్తుడు కాదని, ఆ ప్రజలు వాడే నిత్యవసర వస్తువుల పై పెంచిన ధరలను తగ్గించమని ప్రజల గొంతుకై నిలిచేవాడు ఉపాధ్యాయుడని, బోధించడం అంటే బాధించడం కాదని విద్యార్థుల మస్తిష్కాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను కనిపెట్టి వాటికి పరిష్కారాలు వెతికేటోడని, ఆ విద్యార్థుల యొక్క మెదళ్ళ ను ఆలోచింప చేసేవాడని, ఉపాధ్యాయుడు అంటే తన యొక్క సొంత విషయాలలో(సబ్జెక్టు )ఉన్నటువంటి సమస్యలు మాత్రమే పరిష్కరించేవాడు కాదు అన్ని విషయాలను అవగతం చేసుకుని, పిల్లలకు విమర్శనాత్మకంగా వివరించేవాడే ఉపాధ్యాయుడని,
తరగతిగది అంటే ఉపాధ్యాయుని కేంద్రీకృతం కాదని సమాజ కేంద్రీకృతమని సమాజo అంటే ఏమిటో తరగతి గదిలోకి తీసుకొని వచ్చి విద్యార్థులకు విశ్లేషించి, ఆ తర్వాత తరగతి గదిని భవిష్యత్తు సమాజంలోకి నడిపించగలిగినవాడు ఉపాధ్యాయుడని, శాస్త్రీయ విజ్ఞానం అంటే గోడలపై నినాదలు రాసుకోవడం కాదు, ముందుగా ఉపాధ్యాయుడు శాస్త్ర విజ్ఞానాన్ని విశ్వసించి ప్రతినిత్యం ఆచరించిన వాడని, పేదల శ్రమను ధనికులు ఎలా దోపిడి చేస్తారో విడమరచి చెప్పేటటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడు సామాన్య రూపంలో ఉన్న అసామాన్య ఉపాధ్యాయుడని, ఒక నిజమైన ఉపాధ్యాయుని యొక్క ఆలోచనను వ్యక్తం చేశారు. సమాజంలో వచ్చే మార్పును, చరిత్ర ను వివరించడమే కాదు, ఆ చరిత్రను మార్చడానికి కావలసిన కర్తవ్యాన్ని ప్రజాస్వామికమైన తెలంగాణలో వ్యాపింప చేసిన సామాన్య రూపంలో ఉన్న అసామాన్య ఉపాధ్యాయుడని,
ఈ సామాన్య ఉపాధ్యాయుడు ఎప్పుడూ అవార్డుల కోసం ఎమ్మెల్సీ పదుల కోసం వెంపర్లాడ లాడే వాడు కాదని, సర్వ జనుల ఆకాంక్షలు నెరవేర్చుటకై జనం గొంతు గా మారి నివదించినవాడు, ప్రజాస్వామిక తెలంగాణకై ప్రాణాలోడ్డిన సామాన్య రూపంలో ఉన్న అసామాన్య ప్రతిభ కలిగిన, స్వార్థం లేని, సమాజం గురించి ఆలోచించే నిస్వార్థ, నిజమైన ఉపాధ్యాయుడని ఈ కవిత ద్వారా తన యొక్క దృక్పథాన్ని వ్యక్తపరిచారు.
అతను 'ఒక సామాన్య' ఉపాధ్యాయుడు@:- నామ వెంకటేశ్వర్లు, స్కూ. అ.-కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి