న్యాయాలు-907
"నహి ప్రమాణం జంతూనా ముత్తర క్షణ జీవనే "న్యాయము
*****
నహి అనగా లేదు, అంతేకాదు.ప్రమాణం అనగా ఋజువు, సరైన జ్ఞానము యొక్క అర్థము, ఒట్టు పెట్టుకునుట.జంతూనా అనగా జంతువుల యొక్క.ఉత్తర క్షణం అనగా తదుపరి క్షణం, తరువాత సమయం.జీవనే అనగా జీవితంలో అని అర్థము.
జంతువులు ఉత్తర క్షణములో జీవించి ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.అనగా "ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, మరణం ఎలా సంభవిస్తుందో చెప్పలేం" అని అర్థము.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరమూ ఊహించలేము. లవకుశ సినిమాలో ప్రముఖ గీత రచయిత కొసరాజు గారి పాట ఈ సమయంలో ఎవరికైనా గుర్తుకు వస్తుంది." ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు/ విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు". అంటూ సీతమ్మ వారు అడవిలో ఉండవలసి వచ్చిన పరిస్థితిని గురించి ఈ పాటను రాసినప్పటికీ ఇది ప్రతి జీవికి వర్తిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించగలమా ? సాహసించగలమా?విధి రాతను తప్పించుకోగలమా? అనేదే ఇందులోని అంతరార్థం.
దీనికి సంబంధించిన ఉదాహరణ ఈ మధ్యనే మన దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాద సంఘటన. 260కి పైగా ప్రయాణీకులు మరియు మెడికల్ విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని మరణించడం. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా,ఉల్లాసంగా కాలం గడుపుతూ ,గమ్య స్థానము చేరేందుకు సిద్ధమైన వారంతా క్షణాల్లో మృత్యువాత పడతారని వారు కానీ, మనం కానీ కలలో కూడా ఊహించలేదు.
అనగా ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియదు. మన పుట్టుక మనకు తెలియదు. మన మరణం మన ఊహకు అందదు.అనగా పుట్టేది, పోయేది మరుక్షణములో ఏం జరిగేది? అంతు చిక్కదు.అయినా మనుషుల్లో కొందరు అన్నీ తెలుసని విర్రవీగుతూ ఉంటారు. అంతే కాదు స్వాములుగానో,బాబాలు గానో చెలామణి అవుతూ, ప్రజలను మోసం చేస్తూ ఉంటారు.అందుకే విజ్ఞులైన మన పెద్దవాళ్ళు "జీవితం క్షణ భంగురం" ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.కాబట్టి ఉన్న క్షణాల్లో సత్కార్యాలు చేస్తూ ,సంతృప్తిగా జీవితాన్ని గడపమని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు.
జీవితం క్షణ భంగురం. ఎవరైనా ప్రమాణ పూర్వకముగా "ఇదిగో ఇంత కాలం బతుకుతావు? అని ఎవరూ ప్రమాణపూర్తిగా చెప్పలేరు. అంటారు మన పెద్దలు."దీనినే తాత్త్వికులు " ఇల్లు ఇల్లు అంటావు - ఉల్లాస పడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా!!" అంటూ అంటూ రాసిన పాట కూడా మనిషి యొక్క జీవిత అనిశ్చితిని తెలియజేస్తుంది.
కాబట్టి ఈ "నహి ప్రమాణాం జంతూనా ముత్తరక్షణ జీవనే" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే "ఈ జీవితం కాదు" కాబట్టి మనకున్న ఈ చిన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఇదే ఈ న్యాయము లోని ఆంతర్యము.అంతకంటేముఖ్యంగా జీవించే ప్రతి క్షణం ఒక వరంగా భావించాలి, దానిని అందరూ మెచ్చే విధంగా చెట్టులానో ,నదిలానో సద్వినియోగం చేసుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి