సాధనా పంచకము :- కొప్పరపు తాయారు.
 శ్రీ శంకరాచార్య విరచిత 
=================            

శోకం:
 క్షుద్వ్యాదిశ్చ చికిత్స్యతాం  ప్రతి దినం బిక్షౌషధం
 భజ్యతాం
 స్వాధ్వన్నం నాతు యాచ్యతాం విధివశాత్ప్రాప్తేన
 సన్తుష్యతాం !
శీతోష్ణాది  వి సహ్యతాం వతు వృధా వాక్యం 
 సముఛ్ఛర్యతాం
ఔదాసీన్య జనకృపా నైష్ఠుర్య
ముత్సృజ్యతాం !

భావం: ఆకలి అను రోగమును నివారించుట ప్రతి దినము బిక్ష అను ఔషధమును సేవింపవలయును. అంటే ఔషధమను బిక్షాన్నము ను, అనాసక్తి తో స్వీకరింపవలెను. స్వాదిష్ఠ భోజనము ను ఎన్నడు ఆశింప రాదు. ప్రారబ్ధవశమున  లభించిన బిక్షతోనే సంతుష్టి 
చందవలెను. శీతోష్ణము, మానవ మానములను
మరియు సుఖదుఃఖాది ద్వంద్వములను అనందపూర్వకముగా, నిశ్చింత భావముతో 
సహించవలెను. ఉదాసీనతనగా అసంగమును,
నిర్వికారమును, శాంతిని ఆశింపవలెను. ఇతరుల కృపను మరియు కట్లూరు వ్యాఖ్యలను పరిత్యజించవలెను.
                   *******

కామెంట్‌లు