పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన హిందూ ఉత్సవాల్లో ఒకటి. ఒడిశాలోని పూరీలో ప్రతి సంవత్సరం ఆశాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ రథయాత్ర వైభవంగా జరుగుతుంది. 2025లో ఇది జూన్ 27న ప్రారంభమై, జూలై 5న ముగుస్తుంది.
ఈ రథయాత్రలో జగన్నాథ స్వామి, బలరాముడు (అన్నయ్య), సుభద్రమ్మ (చెల్లెలు) విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేసిన భారీ రథాల్లో నగర వీధుల్లో ఊరేగిస్తారు. లక్షలాది భక్తులు ఈ దృశ్యం కోసం పూరీకి చేరతారు.
ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని ఆలయం నుంచి తాళధ్వజ రథం మీద ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆయనకు అలంకరించిన తలపాగా, పూలమాలలు, ఇతర అలంకరణలను విగ్రహం నుంచి తీసి భక్తులకు పంచుతారు. వాటిని పొందేందుకు భక్తులు పోటీ పడతారు. తర్వాత అదే విధంగా సుభద్రాదేవిని పద్మధ్వజం రథం మీద ప్రతిష్ఠించి, అలంకరణలను పంచే కార్యక్రమం జరుగుతుంది. చివరగా జగన్నాథుని నంది ఘోష రథంలో ప్రతిష్ఠిస్తారు.
ఇతర ఆలయాల్లో ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను మాత్రమే తీసుకెళ్తారు. కానీ పూరీ జగన్నాథ రథయాత్రలో మూలవిరాట్లనునే గుడి వెలుపలకి తీసుకువస్తారు. ఈ కారణంగా ఈ ఉత్సవం మరింత విశిష్టతను సంతరించుకుంటుంది.
రథయాత్ర ప్రారంభానికి ముందు ఒడిశా రాజు స్వయంగా జగన్నాథుని రథాన్ని తుడిచే సంప్రదాయం "చెరికి పాన్" అని పిలువబడుతుంది. ఇది సామాజిక సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు.
ఇంకొక విశేషం – ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు, అదే రథాలను వాడడం ఆలయంలో ఆచారం కాదు. దేవుడికి విశేషమైన భక్తిశ్రద్ధకు ఇది నిదర్శనం.
రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు తన మేనమామ గుండిచా దేవాలయానికి వెళ్తారు. అక్కడ ఏడు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ఆలయానికి చేరతారు. ఈ రథయాత్ర భక్తి, సంస్కృతి, సమానత్వం, సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి