తొలి బిడ్డ తొలిచూపు
కలిగించు ఎంతో ఆనందం.
భూదేవికి ఆవేదన
చల్లార్చి,
తొలకరి జల్లులు
ప్రకృతికి ప్రసాదిస్తాయి
పచ్చని మొలకలను.
ఎండిన భూమిపై
వెండిముత్యాల్లా
ఉండుండి పడే తొలకరి జల్లు
తోలుకొస్తుంది
పండగలరధాన్నీ
సైరికుని సంబరాలు
పైరుగాలి పకపకలు చెరువులోని నీటిలో
చేపల స్నానాలు
కప్పల సంగీతాలు
చెప్పతరమా
తొలకరి చినుకుల విశేషాలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి