భయం భయంగా:-సత్యవాణి

  అలా జరుగుతుందనకోలేదు.నేను అతడిని గురించి మరోలా భయపడేదాన్ని.
      ఎంతోమందికి కావల్సిన అతడు, మరెంతోమంది పండితులకుఅరాధ్యుడైన అతగాడు, మరెందరో పామరులకూ ఆరాధ్యుడతడు.గళంవిప్పాలని ఆశించే  పాటకారులకు అనుసరణీయుడు మరిఅతగాడు ఎందుకిలా అయిపోతున్నడు. ఎందుకు తన శరీరంపై తను జాగ్రత్తలు తీసికోడు. అబ్దుల్ కలామ్ లా స్టేజిమీదే కుప్పకూలిపోతాడేమో!అప్పుడెలా? ఆపాట ఆగిపోతే ఎలా? ఆమాటల ఉరవడి సాగకపోతే మరెలా?
      అతడిని వారంవారం చూడకపోతే ఎలా? ఈ సంగీత రసఝరి ఆగిపోతే మరెలా?
    ఆ రసవేదికపై అతడిని చూస్తూ, సినీపాటల ఎన్ సైక్లోపీడియాఅయిన అతడిద్వారా ఎన్నో ఎన్నోవిషయాలను గ్రహిస్తూ, నూతన గాయనీ మణుల తీయని పాటల అలలలో మునిగి తేలుతూకూడా, అతడిగురించే అలోచిస్తూ, అతగాడి ఆరోగ్యానికి ఢోకాలేకుండా,కనీసం నేనీ భూమిపై వున్నన్ని రోజులైనా, ఇలాగే, ఇప్పట్లాగేనైనా అతడువుండాలని ఆశించిననాకు, నేను అను నిత్యం భయపడేరీతిగా కాకుండా, హాస్పటలుకి వెళుతూ ఆ మహమ్మారికి బొటన వేలు చూపించి సవాల్ చేసాడని కాబోసు,అతడిపై, అతడి మనోధ్ధైర్యంపై పగబట్టి అతడిని గుటుక్కున మింగేసిందారాకాసి. పాటల రారాజు గొంతును చటుక్కున నొక్కేసింది.
అతడి పాటనారాధించే
వారి ఆశలను పుటుక్కున తెంపేసింది.యావత్ భరతీయుల హృదయాలపై కోలుకోలేని దెబ్బకొట్టిందా కరోనా మహమ్మారి.
అసూయతో భౌతికంగా దూరం చేయగలిగిందేకనీ ఆ పశాచి,
మానసికంగా బాలూను మరపించడందనబ్బకికూడాతరంకాదు
తరంతరం నిరంతరం
ఆ సుస్వరాల రాగాలాపనలను ఆలిస్తునేవుంటాం
ఆనంద రసఝరిలో విహరిస్తూనేవుంటాము
బలూ పాటలపూతోటలో
           
కామెంట్‌లు