బొమ్మలతో చదువులు:- ఎడ్ల లక్ష్మి
అక్షరాల పూదోటలో
ఆ చిన్నారి పిల్లలు 
ఆట పాటల తోటి 
సీతకొక చిలకలు 

అక్షరాల పూలు ఏరి
అందమైన మాలకుర్చి
ఆనందముతో పిల్లలు
సరస్వతి మెడలోవేసి 

మురిపాలతో వారంతా  
బీర బీర పరుగులతో
గురువు వద్దకు చేరి 
చేతులెత్తి మొక్కినారు 

శిక్షణతో గురువులు
అక్షరాల కూర్పుతోడ 
బొమ్మలేసి చదువులు 
నిమ్మలంగా చెప్పినారు


కామెంట్‌లు