సాహితీ కెరటాలు.===============కైలాస శిఖరానా..సువర్ణ మణిమయ సౌధమునందు,ప్రమథ గణ సమేతుడైయున్నపరమేశ్వరా..శిరస్సుపైజోడింపబడిన కరములతో నిలిచి,"ఓ సాంబశివా, స్వామీ,పరమశివా,పాహిమాం పాహిమాం" అనిస్తుతించుచూ, బ్రహ్మ కల్పాలనుకూడా క్షణ కాలమువలే..ఆనందముతో ఎప్పుడు గడిపెదనో కదా!ఉగ్ర జ్వాలలతో దేవతలందరకీ తీవ్రభయమును కలిగించిన ఆగరళముఅరచేతిలో అరముగ్గిన నేరేడుపండా..వైద్యుడిచ్చిన ఔషధ గుళికలా నాలుకపై ఉంచుకోవడానికి..!?నీలమణి పొదిగిన కంఠాభరణమా?కంఠమునందు నిలిపివేయడానికి..!ఈ ఒక్కటే చాలదా? నీవు చేసిన ఈ మహోపకారం..!చరాచర గణములను చూసి,వాటిని రక్షించడం కోసమని,దేవతలందరినీ పరుగెత్తించినఔషధము, ఉగ్ర జ్వాలలు కలిగినది,భీకరమైనది అయినట్టి గరళమునులోపలకు మ్రింగక, బయటకుక్రక్కక, నీవు నీ గళమునందేఉంచుకున్నావే..!హాలాహలం త్రాగి లోకాలనుకాపాడిన ఓ నీలకంఠ!స్వార్ధ జగతి నించి రక్షించి మళ్ళీకాపాడరా!అది చూసిన భయమందని మాతల్లి పార్వతితో గూడి!ఈ సంసార సాగరాన్ని దాటేప్రాణవాన్ని మాకు ఉపాసించరా!కషాయం కాని దివ్య జ్ఞానాన్నిఅర్హులమనిపిస్తే మాకు ఒసగి..ఆత్మోన్నతిని మాకుకరతలామలకం చేయరా ఓ దేవరా!
ఓం.. నమః శివాయ.:- ఓగిరాల గాయత్రి.- విజయవాడ.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి