జాకీ చాన్:- - యామిజాల జగదీశ్

 “నేను వీధుల్లో పడుకున్న రోజులున్నాయి. నన్ను మూర్ఖుడని పిలిచిన వారున్నారు.... కానీ నేను ఎప్పుడూ ప్రయత్నించడం మానలేదు. అసలింకో విషయం...నేను పుట్టినప్పుడు, నా తల్లిదండ్రులకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వారు నన్ను "చాన్ కాంగ్-సాంగ్" అని పిలిచారు. కానీ అప్పట్లో వారికి తెలియని విషయం ఏమిటంటే నా జీవితం సినిమాగా మారుతుందని... ఎల్లప్పుడూ కామెడీగా ఉండదు అని...."  జాకీ చాన్  మాటలివి.
ఆయన తల్లిదండ్రులు కడు పేదవారు.  7 సంవత్సరాల వయస్సులో, ఆయనను ఒక చైనీస్ ఒపెరా పాఠశాలకు పంపారు. అక్కడి  తరగతి గది ఆయనకు జైలులా అనిపించింది. ఏ కళా కాంతి లేనిదిగా భావించారు. ఆయనకక్కడ క్రమశిక్షణ కర్రల రూపంలో వచ్చింది.
పదేళ్ళకు పైగా బందీలా గడిపారు. రోజుకు 19 గంటలు శిక్షణ పొందారు.  పాడటం, నటించడం, విన్యాసాలు చేయడం నేర్చుకున్నారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా, అక్కడాయన బాధను భరించడం నేర్చుకున్నారు. ఆయన ముక్కు, వేళ్లు, చీలమండ విరిగాయి... ఒకసారైతే, ఆయన భవనం నుండి పడి చనిపోయే స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలోనూ ఆయన ఎప్పుడూ "నేను చేయలేను" అని అనలేదు. అందరూ స్టార్ కావాలని కలలు కన్నప్పటికీ, ఆయన మాత్రం ఇష్టపడే దానిని చేయడం ద్వారా జీవించాలనుకున్నారు.  ప్రతి పతనం నిన్నటి కంటే నేను బలంగా ఉన్నానని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకున్నారాయన.
చివరికి ఆయన నటించడం ప్రారంభించినప్పుడు, అందరూ ఆయనను పొట్టివాడివని హేళనగా నవ్వే వారు.  అదేంటా మొహం అని ఆయనను ఎగతాళి చేశారు. ఇలా ఏవేవో మాటలతో నన్ను గాయపరిచారు. అయినా తాననుకున్న ఆశయం సాధనకోసం తీవ్రంగా కృషి చేసిన ఆ వ్యక్తే  జాకీ చాన్!
స్టంట్‌మ్యాన్‌గా పని చేశారు. ఇతరులు అవార్డులను ఇంటికి తీసుకువెళుతుంటే నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. హాలీవుడ్ పదిసార్లకు పైగా నా ముఖం మీద తలుపు తట్టింది… కానీ నేను నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే పడిపోయిన ప్రతిసారీ, ఒక దెబ్బతో లేచే వారు.
"మీరు ఎప్పుడైనా గట్టి దెబ్బ తిని పడిపోతే ఎలా ముందుకు సాగాలో మీకు తెలియదు...అటువంటి స్థితిలో  గుర్తుంచుకోండి.... ఎముకలు నయం అవుతాయి, కానీ వదులుకోవడం వల్ల మీరు చూడలేని మచ్చలు ఉంటాయి...." అని జాకీ చాన్ అనేవారు.
జాకీ చాన్ మార్షల్ ఆర్ట్సులో ప్రసిద్ధి. ఆయన నిష్ణాతుడైన గాయకుడు. సొంత విన్యాసాలతో చరిత్రను తిరగరాసారు. 
ఆయన దాతృత్వ హృదయం కలిగిన ప్రపంచ సూపర్ స్టార్. దాతృత్వ సంస్థలను స్థాపించి తనదైన శైలిలో ఆదుకునే వారు.
జాకీ చాన్ అనతికాలంలో
స్టంట్‌మ్యాన్ స్టార్‌గా మారారు.‌
ఆయన బ్రూస్ లీ తొలినాళ్ల చిత్రాలైన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్‌లలో స్టంట్‌మ్యాన్‌గా పని చేశాడు. 
ప్రత్యేక స్టంట్ బృందం:
ప్రమాదకరమైన విన్యాసాల కారణంగా తన నిర్మాణాలకు బీమా పొందడంలో ఇబ్బంది పడటంతో అతను సింగ్ కర్ పాన్ అనే తన సొంత స్టంట్ బృందాన్ని సృష్టించాడు. 
ఆయన అంకితభావంతో కూడిన పరోపకారి. జాకీ చాన్ ఛారిటబుల్ ఫౌండేషన్, డ్రాగన్స్ హార్ట్ ఫౌండేషన్‌లను స్థాపించారు.
 
చాన్ గాయకుడిగా అనేక ఆల్బమ్‌లను విడుదల చేశారు. అనేక భాషలలో పాడారు.
జాకీ చాన్ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నమోదు చేశారు. 
మరణించిన తర్వాత తన ఆస్తిలో సగభాగాన్ని దాతృత్వానికి విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. 
ఆయన శారీరకంగా పరాక్రమవంతుడైనా  సూదులంటే తీవ్ర భయం.
ఆయన తన  ఆత్మకథ 'నెవర్ గ్రో అప్' లో, తప్పులను స్వీకరించడం, వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం గురించి విస్తారంగా ప్రస్తావించారు. 
ఆయన డిస్లెక్సియాతో ఇబ్బంది పడ్డారు. 
ఆస్ట్రేలియాలో నిర్మాణ రంగంలో పని చేస్తున్నప్పుడు ఆయనకు "జాకీ" అనే పేరు వచ్చింది. అక్కడ "జాక్" అనే సహోద్యోగి అతనికి "లిటిల్ జాక్" అని మారు పేరు పెట్టాడు. 
2016 లో, ఆయన తన విలక్షణమైన అంతర్జాతీయ కెరీర్‌కు గౌరవ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
చాన్, బ్రూస్ లీ మంచి స్నేహితులు

కామెంట్‌లు