యోగా దినోత్సవ శుభాకాంక్షలు...!
============================.
అవి ప్రాణాయామ,క్రియా యోగ,హఠయోగములైనను...
సూర్య నమస్కారాది యోగాసనములైననూ...
మనకు మనముగా
ఏకాగ్రతలో... మరో ధ్యాసలేక మనచే చేయించేదే యోగా...!
దానిలో...శ్వాస మీదకు ధ్యాస మళ్ళీ...
మనో మాలిన్యాలను దగ్ధం చేస్తుంది...!
దీనిలో...సూర్యనమస్కారాది యోగాసనాలతో...
శరీరమంతా మన అధీనం లోనికి వచ్చి
స్వయం నియంత్రణ సాధ్యమౌతుంది...!!
యోగాభ్యాసాలలో దేనిని అభ్యసించిన...
ప్రశాంతత, ఆరోగ్యము,ఆనందము ప్రాప్తించడం తథ్యం...!
చిన్నప్పటినుండి... రోజూ పూటకు అర్ధగంట యోగాభ్యాసం చేస్తే....
ఆరోగ్యమే కాక ఐశ్వర్యము చేకూరుతుందనుట అతిశయోక్తి కాదు....!
యోగము ప్రాచీన భారతీయ ఋషులు మనకందించిన వెలకట్టలేని సంపద ..!
దీనిని ప్రతి భారతీయుడు అభ్యసించి...
దీని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ...
మన భారతీయ ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటవలసిన బాధ్యత ..
.మన ప్రతి భారతీయునిపై ఉన్నది !!
జయహో యోగా...!
జయ జయహో భారత్ ..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి