మరదలు పిల్ల:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
మరదలు పిల్ల రావమ్మా 
మల్లె మాల తెచ్చాను
మీ చెల్లి చేతికి ఇచ్చాను  
ఇటు వచ్చి చూడమ్మా 

పల్లెటూరి పాటలతో
అల్లి బిల్లి ఆటలతో 
కళ్ళేములేని గుర్రముల 
పరుగు తీస్తూ రావమ్మా

మెరుపుల వెలుగులలో 
ఉరుముల ఊయలలో 
కురిసే వాన జల్లులతో 
జలకాలాడి రావమ్మ

నుదుట బొట్టు పెట్టుకొని 
పట్టు పరికిణి వేసుకుని 
చుట్టూ తిరిగి రావమ్మా 
నా చెంతకు నీవు చేరమ్మా


కామెంట్‌లు