కాలచక్రానికి కందెనవేసి నడిపించేవి
కార్తెలు.
వాన, ఎండ, మంచు కురిపించి
ఆయా కాలాలలో ఉంచు,మనుషులకు
ఆయురారోగ్యాలను
ఋతువులు
నైరుతి రుతుపవనాలు
తెస్తాయి చల్లదనాన్ని
ఎండల కార్తెలలో
బండలు పగులుతాయని సామెత
బండలు కాదు మనుషుల గుండెలు కూడా
ఎండకు ఎండిపోతుంటాయి
వాటి మీద కాస్త చల్లని నీరు చల్లేది మృగశిర.
పల్లెలలో నాగళ్ళు
కళ్ళు తెరుస్తాయి. ఎద్దులు ఒళ్ళు విరుచుకుంటాయి.
యజమానుల పూజలు అందుకుని
కదులుతాయి
తడి తాకిన భూమాత వైపు.
రైతన్నలకు, ఏరువాక
కరువు తీర్చే కన్నతల్లి
దేశ ప్రగతికి, జనుల జీవన గతికి ఏరువాక
గొప్ప తీరు కలిగిన పండుగ. నాగళ్ళతో దున్ని
ఆనాడు చల్లెడి విత్తులే
జగతి ప్రగతికి
సద్గతి.
మృగశిర కార్తెకు శిరసు వంచి
మ్రొక్కులిడెదము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి